Share News

BigBoss Show: బిగ్ బాస్ షోపై తెలంగాణ హెచ్చార్సీకి ఫిర్యాదు

ABN , Publish Date - Dec 20 , 2023 | 02:40 PM

Telangana: బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. బిగ్ బాస్ షో పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ ఎచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

BigBoss Show: బిగ్ బాస్ షోపై తెలంగాణ హెచ్చార్సీకి ఫిర్యాదు

హైదరాబాద్: బిగ్ బాస్ షోపై (BigBoss Show) తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు (Telangana Human Rights Commission) ఫిర్యాదు అందింది. బిగ్ బాస్ షో పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ (High Court Advocate Arun) ఎచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద చేసిన వీరంగం అంతా ఇంతా కాదన్నారు. జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయని.. కానీ ఎక్కడ హీరో నాగార్జున (Actor Nagarjuna) పేరు లేదన్నారు. హీరో నాగార్జునను బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. 8 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయని, హీరో నాగార్జునపై కేసు నమోదు చేయాలన్నారు. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాసినట్లు తెలిపారు. బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వహించారని.. నాగార్జునను వెంటనే అరెస్ట్ చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 20 , 2023 | 02:40 PM