ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు..

ABN, First Publish Date - 2023-03-08T08:56:16+05:30

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందాయి. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Delhi : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ నుంచి నోటీసులు అందాయి. ఈ నెల 9న ఢిల్లీలో విచారణకు హాజరు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది. రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించనున్నారు. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును పదేపదే ఈడీ ప్రస్తావించింది. కాగా.. నేటి సాయంత్రమే కవిత ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షలో ఆమె పాల్గొననున్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం కవిత నిరాహార దీక్ష చేయనున్నారు. మరోవైపు.. రామచంద్ర పిళ్లై (Ramachandra Pillai)ను 5 రోజుల కస్టడీ కి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (CBI Special Court) అనుమతించింది.

బిగుస్తున్న ఉచ్చు..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా పేర్కొంటున్న హైదరాబాద్‌ మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఆయన రిమాండ్‌ రిపోర్టులో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించింది. పిళ్లై, ప్రేమ్‌రాహుల్‌లు కవితకు బినామీలని స్పష్టం చేసింది. పిళ్లైని రెండు రోజులపాటు విచారించిన తర్వాత సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. మంగళవారం ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. తాము ఎమ్మెల్సీ కవిత ప్రయోజనాలను కాపాడేందుకే వ్యాపారంలో చేరామని అరుణ్‌ పిళ్లై, ప్రేమ్‌రాహుల్‌ తమ విచారణలో అంగీకరించారని తెలిపింది.

ఇప్పటి వరకూ ఇలా..!

కవిత ప్రయోజనాల కోసమే పిళ్లై ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం మేరకు భాగస్వామిగా ఉన్నారని వెల్లడించింది. కుంభకోణంలో పిళ్లైదే కీలకపాత్ర అని.. తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. స్పందించిన న్యాయస్థానం.. ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. మరోవైపు ఇదే కేసులో తిహాడ్‌ జైలులో ఉన్న మనీశ్‌ సిసోడియాను ఈడీ అధికారులు మంగళవారం విచారించగా.. కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును మరోసారి విచారణకు హాజరు కావల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ఏజెన్సీలను ప్రయోగిస్తున్నారంటూ కేసీఆర్‌ సహా విపక్ష నేతలు లేఖ రాసిన 24 గంటల్లోనే ఈ పరిణామాలన్నీ చోటుచేసుకోవడం గమనార్హం.

Updated Date - 2023-03-08T11:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising