ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN Arrest: తెలంగాణలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రభావం

ABN, First Publish Date - 2023-09-13T20:14:14+05:30

తెలంగాణలో (Telangana politics) తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్ ప్రభావం కనిపిస్తోంది.

హైదరాబాద్: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అక్రమ అరెస్ట్ ప్రభావం తెలంగాణలో(Telangana) కనిపిస్తోంది. కూకట్‌పల్లిలో చంద్రబాబు మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌ను కేసీఆర్‌, కేటీఆర్‌ ఖండించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబు అప్రజాస్వామిక అరెస్ట్పై సెటిలర్స్ భగ్గుమంటున్నారు.చంద్రబాబు అరెస్ట్పై ఐటీ ఉద్యోగులు, తెలంగాణ పౌరహక్కుల సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు, టీడీపీ అభిమానులు నిరసనల్లో పాల్గొని ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

కూకట్‌పల్లి‌లో అభిమానుల ఆందోళన

అభిమాలనుల ఆందోళనతో కూకట్‌పల్లి, JNTU మార్గంలో భారీగా ట్రాఫిక్‌జామ్‌ అవుతోంది.చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ నేతలు రోడ్డెక్కారు.అమరావతి సపోర్టర్స్ నాయకులు రోడ్లపై ఆందోళనలను ఉధృతం చేశారు.ఈ ఆందోళనల్లో చంద్రబాబు అభిమానులు, టీడీపీ నేతలు భారీగా పాల్గొన్నారు. వెంటనే చంద్రబాబును విడుదల చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. KPHB గాంధీ విగ్రహం నుంచి KPHB పీఎస్ వరకు ర్యాలీని చంద్రబాబు మద్దతుదారులు నిర్వహించారు . ఐయామ్ విత్ సీబీఎన్ ఫ్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-13T21:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising