ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kaleshwaram Project: కిషన్‌రెడ్డి ప్రకటనపై సీబీఐ మాజీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-11-08T14:47:52+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరిస్తే రెండు గంటల్లోనే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరుపుతుందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనిపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పందించారు.

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అంగీకరిస్తే రెండు గంటల్లోనే కాళేశ్వరంపై (Kaleshwaram Project) సీబీఐ (CBI) విచారణ జరుపుతుందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) చేసిన ప్రకటనపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు (Former CBI Director Nageswara Rao) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపొచ్చని.. సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వ(Telangana Government) అనుమతి అవసరం లేదని కిషన్‌రెడ్డికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. కేంద్ర జలశక్తి శాఖే (Central Hydropower Department) సీబీఐ విచారణకు ఆదేశించవచ్చని తెలిపారు. కేంద్రానికి చెందిన 10 ఏజెన్సీలే కాళేశ్వరానికి అనుమతులిచ్చిందని వెల్లడించారు. అందుకే కేంద్రమే సీబీఐ విచారణ కోరవచ్చన్నారు. అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణ కోరవచ్చన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు. సీబీఐ విచారణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిందితులుగా తేలితే అప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుందని నాగేశ్వరరావు వెల్లడించారు.

Updated Date - 2023-11-08T14:48:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising