Kavitha ED Enquiry: కవిత అరెస్ట్ అవుతారా..? జేడీ లక్ష్మీనారాయణ ఏం తేల్చారంటే..

ABN, First Publish Date - 2023-03-16T14:03:40+05:30

కవిత అంశంపై ఈడీ దగ్గర కొన్ని మార్గాలు ఉన్నాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

Kavitha ED Enquiry: కవిత అరెస్ట్ అవుతారా..? జేడీ లక్ష్మీనారాయణ ఏం తేల్చారంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor Scam) లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLS Kavitha) ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందుకు విచారణకు హాజరుకాలేనని, అలాగే ఆరోగ్యం కూడా బాగోలేదని విచారణకు మరో తేదీని నిర్ణయించాలని కవిత తన న్యాయవాదుల ద్వారా ఈడీకి సమాచారం అందజేశారు. ఈ క్రమంలో ఈడీ అధికారుల ముందు ఉన్న మార్గాలు ఏంటి?... విచారణకు కవిత హాజరుకావాల్సిందేనా?.. లేక అరెస్ట్ చేసి విచారణ జరుపుతారా?.. అనే అంశంపై ఏబీఎ‌న్ - ఆంధ్రజ్యోతి (ABn- Andhrajyothy)తో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former CBI JD Lakshminarayana)మాట్లాడారు.

ఈడీ (ED) ఇచ్చిన నోటీసుపై కవిత (Kavitha) సమాధానం ఇచ్చారని అన్నారు. కవిత అంశంపై ఈడీ దగ్గర కొన్ని మార్గాలు ఉన్నాయన్నారు. ఈడీ మరో తేదీని ఇచ్చే అవకాశం ఉందని, లేదా సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున అది ముగిసేవరకు వేచి చూసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కస్టడీలో ఉన్నవారి దగ్గరకు రమ్మని కవితకు సమన్లు జారీ చేసే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. కవిత తన సెల్‌ఫోన్లను నిర్వీర్యం చేశారని అంటున్నారని, ఆ ఫోన్లలో ఈడీ తమకు అవసరమైన అంశాలు ఉన్నాయని... దీనిని ప్రాధాన్యతగా భావించే అవకాశం ఉందని తెలిపారు. అన్ని అంశాలను బేరీజు వేసుకునే కవిత అరెస్ట్‌పై నిర్ణయం ఉంటుందని ఏబీఎన్‌తో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

ఇలాంటి క్రిమినెల్ కేసులలో ప్రతీ విషయాన్ని కోర్టు ద్వారా పరిష్కారం అవ్వాలే తప్ప.. వ్యక్తిగత అభిప్రాయాలు చెల్లుబాటు కావని తెలిపారు. కోర్టు ద్వారానే పరిష్కారం పొందాలని సూచించారు. కవిత తన ప్రతినిధి సోమా భరత్ ద్వారా ఈడీకీ పంపిన సమాచారంలోని విషయాలు సుముఖంగా ఉంటే మరో తేదీ ఇచ్చే అవకాశం ఉందన్నారు. అరెస్ట్ చేసే అధికారం ఉంది కదా అని ప్రతీ కేసులో కూడా దర్యాప్తు సంస్థలు అరెస్ట్‌లు చేయరన్నారు. ఈ కారణాల వల్ల అరెస్ట్ చేశామంటూ కోర్టు ముందు చెప్పాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థల ముందు ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.

Updated Date - 2023-03-16T14:26:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising