సగం మందికి కంటి దృష్టి లోపాలు

ABN , First Publish Date - 2023-07-19T03:52:06+05:30 IST

దాదాపు సగం మంది ఏదో ఒక కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నేత్ర వైద్య పరీక్షలో తేలింది.

సగం మందికి కంటి దృష్టి లోపాలు

హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ నేత్ర పరీక్షలు

అందుబాటులోకి ఆప్తల్మాలజీ గ్లాకోమా స్ర్కీనింగ్‌ యంత్రం

హైదరాబాద్‌ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : దాదాపు సగం మంది ఏదో ఒక కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నేత్ర వైద్య పరీక్షలో తేలింది. ఎస్‌ఈఈడీ- యూఎస్‌ఎ, హెల్పిం గ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ కలిసి ఏడాదిలో నగరంలోని 50 వేర్వేరు అర్బన్‌ మురికి వాడల్లో ఇప్పటి వరకు 10,062 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. ప్రధానంగా కంటికి సంబంధించిన రిఫ్ర్టాక్టివ్‌ లోపాలతో దాదాపు 58 శాతం మంది బాధపడుతున్నట్లు ఈ పరీక్షలు ద్వారా తేలింది.

అలాగే 45 శాతం మందికి యూని ఫోకల్‌ విజన్‌, 35 శాతం మందికి బై ఫోకల్‌ విజన్‌, 20 శాతం మందికి రీడింగ్‌ గ్లాసెస్‌ ఉన్నాయని, స్ర్కీనింగ్‌ చేసిన వారిలో 7 శాతం మందికి కంటి శుక్లం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 60 మందికి ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. గ్లాకోమాను ముందస్తుగా గుర్తించడం, కంటి దృష్టిని సంరక్షించడానికి, తదుపరి నష్టాన్ని నివారించడానికి ఎంతో అవసరమని నేత్ర శస్త్ర వైద్యుడు డాక్టర్‌ అర్షియా అక్బర్‌ తెలిపారు. అలాగే రాజేంద్రనగర్‌లోని వాడి ఇ-మహమూద్‌లో ఉన్న మసీదులో మంగళ వారం అప్‌గ్రేడెడ్‌ కమ్యూనిటీ ఆప్తాల్మాలజీకి గ్లాకోమా స్ర్కీనింగ్‌ యంత్రా న్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఈఈడీ- యూఎస్‌ఎ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, మజారుద్దీన్‌ హుస్సేనీ, హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌, ముజ్తబా హసన్‌ అస్కారీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-19T03:52:06+05:30 IST