ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly: వరదలపై అసెంబ్లీలో వాడివేడీగా చర్చ.. శ్రీధర్‌బాబు ప్రసంగిస్తుండగా మంత్రులు ఎదురుదాడి

ABN, First Publish Date - 2023-08-04T15:43:58+05:30

వరదలపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరిగింది. వరద సాయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌‌బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో శ్రీధర్‌‌బాబు మాట్లాడుతుండగా అడుగడుగునా మంత్రులు అడ్డు తగిలారు.

హైదరాబాద్: వరదలపై తెలంగాణ అసెంబ్లీలో (TS Assembly) వాడివేడీగా చర్చ జరిగింది. వరద సాయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌‌బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో శ్రీధర్‌‌బాబు మాట్లాడుతుండగా అడుగడుగునా మంత్రులు అడ్డు తగిలారు. చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రులు తొండి వాదనలు తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్ నేతలు.. చెక్ డ్యామ్‌లు వద్దన్నట్లు తప్పుడు వాదనలు చేశారు. అసలు శ్రీధర్‌బాబును మాట్లాడనివ్వకుండా మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. శ్రీధర్‌బాబు ప్రసంగం పూర్తి కాకుండానే వెంటనే అక్బరుద్దీన్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు.

కాంగ్రెస్-మంత్రుల మధ్య వాదోపవాదాలు..

శ్రీధర్‌బాబు ప్రసంగిస్తుండగా మంత్రి కేటీఆర్ మధ్యలో అడ్డు తగిలారు. విద్యుత్‌పై రేవంత్ కామెంట్స్‌ను ప్రస్తావించారు. వరదలపై సమాధానం చెప్పలేక కేటీఆర్ డైవర్ట్ చేస్తున్నారని శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌పై ప్రత్యేక చర్చ పెడితే తాము చర్చకు సిద్దమని శ్రీధర్ బాబు సవాల్ విసిరారు. మధ్యలో భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని.. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న మాట అనలేదని వివరణ ఇచ్చారు. తాము వీడియో చూపిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వెంటనే వరద నష్ట పరిహారం ప్రకటించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం శాస్త్రీయంగా లేదని... వరదలకు ఇది కూడా ఒక కారణమని శ్రీధర్‌బాబు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం పుచ్చుకుని.. ఉప ద్రవం వచ్చింది కాబట్టి నష్టం జరిగింది.. ప్రభుత్వం మీద శ్రీధర్‌బాబు బురద జల్లొద్దని మంత్రి కోరారు.

హరీష్ రావు..

‘‘పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి 24 గంటల కరెంట్ వద్దు అంటున్నారు. చెక్ డ్యామ్‌లు వద్దని శ్రీధర్ బాబు అంటున్నారు. మరో కాంగ్రెస్ నేత ధరణి వద్దు అంటున్నారు. ఇదేనా కాంగ్రెస్ విధానం. చెక్ డ్యామ్‌ల వల్ల నష్టం అంటారని నేను ఊహించలేదు’’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని.. చెక్ డ్యామ్ వద్దు అనలేదు. శాస్త్రీయంగా నిర్మాణం చేయలేదని వివరణ ఇచ్చారు.

Updated Date - 2023-08-04T15:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising