Hyderabad: తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలపై హైకోర్టు కీలక తీర్పు
ABN , First Publish Date - 2023-01-25T16:35:02+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలపై హైకోర్టు (High Court) కీలక తీర్పు ఇచ్చింది.

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలపై హైకోర్టు (High Court) కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు అధికారికంగా నిర్వహించాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు (Interim Orders) ఇచ్చింది. శ్రీనివాస్ అనే సామాన్యుడు వేసిన పిటిషన్‌పై బుధవారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్ (Raj Bhavan)కే ఎందుకు పరిమితం చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ (Guidelines) పాటిస్తారా? లేదా? చెప్పాలంది.
పిటిషనర్ తరఫున న్యాయవాది, మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించారు.

ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటించాలని పేర్కొంది. అలాగే గణతంత్ర వేడుకలకు కోవిడ్ (Covid) కారణం చూపడం సరికాదని.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తప్పకుండా పరేడ్ గ్రౌండ్‌తో కూడిన వేడుకలు నిర్వహించాలని, పరేడ్ ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయించుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టులో సయితం గణతంత్ర వేడుకలు జరుపుతామని న్యాయస్థానం పేర్కొంది.