Share News

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

ABN , Publish Date - Mar 14 , 2025 | 08:43 PM

ఓ వివాహ వేదికపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధూవరులు వేదికపై బంధువలతో ఫొటోలు దిగుంటారు. ఇంతలో ఓ యువతి నేరుగా వేదికపైకి వచ్చి వరుడిని కౌగిలించుకుంటుంది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

వివాహ సమయాల్లో సినిమా తరహా ఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. కొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నే సీన్లు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటనలన్నీ ఆ మరుక్షణమే వీడియోలుగా మారి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ వేదికపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి వధువు ఎదుటే వరుడిని కౌగిలించుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వరుడి కొంపముంచిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) వేదికపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధూవరులు వేదికపై బంధువలతో ఫొటోలు దిగుంటారు. ఇంతలో ఓ యువతి నేరుగా వేదికపైకి వచ్చి వరుడిని కౌగిలించుకుంటుంది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ‘‘ఈ అమ్మాయి ఎవరు, నన్నెందుకు కౌగిలించుకంది’’.. అని అనుకుంటూ అలాగే చూస్తుండిపోతాడు.

Tiger Viral Video: రీల్స్ చూస్తున్న యువకుడు.. మంచం వద్దకు వచ్చిన పులి.. చివరకు చూస్తే..


వరుడిని యువతి కౌగిలించుకోవడంతో పక్కనే (young woman hugging groom) ఉన్న వధువు కూడా అవాక్కవుతంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తుండిపోతుంది. యువతి దూరంగా నెట్టాలని వరుడు ఎంత ప్రయత్నించినా ఆమె మాత్రం అతన్ని చాలా సేపు గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అంతా ఒక్కసారిగా తెగ నవ్వుకున్నారు.

Theft Funny Video: రాత్రి వేళ కారు వద్దకు వెళ్లిన దొంగలు.. చివరకు దేన్ని ఎత్తుకెళ్లారో చూస్తే.. ఖంగుతింటారు..


వరుడిని ఆట పట్టించడానికి అతడి స్నేహితుడు అలా యువతి వేషం ధరించి వచ్చినట్లు తెలిసిపోతుంది. దీంతో వరుడితో పాటూ వధువు కూడా తెగ నవ్వుకుంటుంది. ఇలా స్నేహితులంతా కలిసి వరుడిని ఆట పట్టించారన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వరుడికి ఒక్కసారిగా ఫ్లాష్‌బ్యాక్ గుర్తుకొచ్చి ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘మొత్తానికి వరుడికి చుక్కలు చూపించాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Metro Viral Video: బస్టాండ్ చేశావ్ కదరా.. మెట్రోలో ఇతడి నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 14 , 2025 | 08:43 PM