ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad:అప్పటి దాకా కళ్ల ముందున్న ఓ కొడుకు చనిపోవడం, మరో కొడుకు మృత్యువుతో పోరాడుతుండటంతో తల్లిదండ్రుల రోదన చూస్తుంటే..

ABN, First Publish Date - 2023-04-16T13:24:42+05:30

అప్పటి దాకా కళ్ల ముందు ఉన్న కుమారుల్లో ఒకరు మృతిచెందడం, మరొకరు ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాటం చేస్తుండటంతో ఆ తల్లిదండ్రులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కొడుకు కోరికను మన్నించి ఆ తల్లిదండ్రులు బైక్‌ను కొనిపెట్టారు. ఆర్థికభారం అయినప్పటికీ కొడుకు సంతోషం కోసం అప్పు చేసి మరీ బైక్ కొన్నారు. కానీ ఆ బైకే వారి కొంపముంచుతుందని ఊహించలేదు.. బైక్ ప్రమాదంలో ఓ కొడుకు మృత్యవాత పడగా మరో కుమారుడు ఆస్పత్రిలో మృత్యువులో పోరాడుతుంటే..ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తుంటే చూసేవారిని కంటతడి పెట్టిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లో ఉంటున్న అనసూరి రాంబాబు సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు తరుణ్‌ ఆదిత్య(18), సత్యసాయి(15) ఉన్నారు. సత్యనారాయణ జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌.78 జర్నలిస్టుకాలనీలోని ఓ హోమ్స్‌లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. సర్వెంట్‌ క్వార్టర్స్‌లో కుటుంబంతో ఉంటున్నాడు. తరుణ్‌ ఆదిత్య ఇంటర్‌ పూర్తి చేసి ఎంసెట్‌కు సిద్ధమవుతున్నాడు. సత్యసాయి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. తరుణ్‌ఆదిత్య ఇంట్లో తండ్రితో గొడవ పడి ఆరు నెలల క్రితం కేటీఎం ద్విచక్ర వాహనం కొనుగోలు చేయించాడు. ఆర్థిక భారం అయినప్పటికీ కుమారుడి కోసం అప్పు చేసి మరీ బైక్‌ కొన్నాడు.

శనివారం ఉదయం అన్నదమ్ములు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 10లో ఉండే నాయనమ్మ ఇంటికి బైక్‌పై బయలు దేరారు. తరుణ్‌ ఆదిత్య డ్రైవ్‌ చేస్తుండగా, సత్యసాయి వెనుక కూర్చున్నాడు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 36 చట్నీస్‌ రెస్టారెంట్‌ మూలమలుపు వద్ద, రాంగ్‌రూటులో ద్విచక్ర వాహనంపై షేక్‌ అలీముద్దీన్‌ వస్తున్నాడు. ఈ క్రమంలో రెండు వాహనాల హ్యాండిల్స్‌ తగలడంతో అన్నదమ్ములు ఉన్న బైక్‌ అదుపుతప్పి, ఫుట్‌పాత్‌ దిమ్మెను ఢీ కొట్టింది. అన్నదమ్ములతో పాటు అలీముద్దీన్‌కు కూడా గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్‌ పోలీసులు ముగ్గురిని 108లో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో సత్యసాయి మృతిచెందాడు. తరుణ్‌ ఆదిత్య పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

అప్పటి దాకా కళ్ల ముందు ఉన్న కుమారుల్లో ఒకరు మృతిచెందడం, మరొకరు ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాటం చేస్తుండటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ నెల 23న సత్యసాయి పుట్టిన రోజు కావడంతో ఈ విషయాన్ని తలచుకుని రోదిస్తున్నారు.

Updated Date - 2023-04-16T13:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising