ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: టెలిగ్రామ్ యాప్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి

ABN, First Publish Date - 2023-02-24T12:35:57+05:30

నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తీరున తమ క్రైం పంథా మార్చుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజా టెలిగ్రామ్ యాప్ పై దృష్టి పెట్టారు కేటుగాళ్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తీరున తమ క్రైం పంథా మార్చుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజా టెలిగ్రామ్(Telegram) యాప్ యూజర్లపై దృష్టి పెట్టారు కేటుగాళ్లు. నాలుగు రోజుల్లో రూ. 1.30కోట్లు కాజేశారు. అందమైన యువతుల డీపీలు పెట్టి యూజర్స్ ను ట్రాప్ చేస్తున్నారీ చీటర్స్. టెలిగ్రామ్(Telegram) లో ఫోన్ నెంబర్ హైడ్ ఆప్షన్ ను అనుకూలంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అందినకాడికి కాజేసి ఆ తర్వాత టెలిగ్రామ్ లో అకౌంట్ డిలీట్ చేస్తూ యూజర్లను బెంబేలెత్తిస్తున్నారు.

ఇలాంటి సైబర్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు అన్ని ప్రచారాలను ప్రారంభించినప్పటికీ, కమీషన్ల ఎరకు ప్రజలు ఇప్పటికీ బలైపోతున్నట్లు బాధితుల ఫిర్యాదులు వెల్లడిస్తున్నాయి. తాజాగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సహా మరో ఇద్దరిని ట్రాప్ చేసి రూ.1.30 కోట్లు కాజేశారు కేటుగాళ్లు.

వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగికి టెలిగ్రామ్ లో సారా అనే యువతి పరిచయమైంది.మా వెబ్ సైట్ లో రూ. 2లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. కేవలం యూట్యూబ్ లో వీడియోలు చూడడం.. లైక్ చేయడం ద్వారా రోజుకు 2 లక్షలు సంపాదించండి అని నమ్మించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న బాధితుడికి మొదట్లో వేలల్లో లాభం చూపించింది. దఫదఫాలుగా రూ.21 లక్షలు డిపాజిట్ చేసేలా చూసింది. ఇంకా డిపాజిట్ చేయాలని కోరడంతో అనుమానం వచ్చిన బాధితుడు డబ్బులు రిటర్న్ చేయాలని నిలదీశాడు. దీంతో ఆ యువతి అతడి అకౌంట్ ను టెలిగ్రామ్(Telegram) యాప్ నుంచి డిలీట్ చేసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Updated Date - 2023-02-24T12:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising