ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad : వరుడు తాళి కట్టు వేళ.. వధువు తలవంచి కూర్చొని ఉంది.. అంతలోనే పోలీసులు ప్రత్యక్షం ..సీన్ కట్ చేస్తే..

ABN, First Publish Date - 2023-02-25T11:57:56+05:30

వధూవరులు పెళ్లి పీటలపై ఉన్నారు. పండితులు మంత్రాలు చదువుతుండగా తాళి కట్టే సమయం ఆసన్నమైంది. ఇంతలో ఆపండి.. అంటూ ఓ యువతి బంధువులను, పోలీసులను వెంటబెట్టుకుని వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజేంద్రనగర్‌, ఆంధ్రజ్యోతి: వధూవరులు పెళ్లి పీటలపై ఉన్నారు. పండితులు మంత్రాలు చదువుతుండగా తాళి కట్టే సమయం ఆసన్నమైంది. ఇంతలో ఆపండి.. అంటూ ఓ యువతి బంధువులను, పోలీసులను వెంటబెట్టుకుని వచ్చింది. ఇదేదో సినిమా కథ అనుకునేరు.. యథార్థ సంఘటన. ఇది జరిగింది ఎక్కడో కాదు.. నగరంలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ లక్ష్మీగూడకు చెందిన దివంగత తుమ్మల అంజయ్య కుమారుడు పృథ్వీరాజ్‌(25), అదే బస్తీకి చెందిన అడికె రాజు కుమార్తె ఐశ్వర్య(19) ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని అనివార్య కారణాలతో వారు సకాలంలో పెళ్లి చేసుకోలేకపోయారు. అయితే, పృథ్వీరాజ్‌కు ఇటీవల మరో యువతితో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం గండిపేట్‌ మండలం మంచిరేవులకు చెందిన సంగం వినోద్‌ కుమార్తె శ్రావ్య(23)తో వివాహానికి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబాలు మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌లోని పీవీ కన్వెన్షన్‌లో పెళ్లి నిర్వహణలో బిజీగా ఉన్నారు. బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతుండగా పెళ్లి కుమారుడు పృథ్వీరాజ్‌ పీటల మీద కూర్చొని శ్రావ్య మెడలో మూడుముళ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

అంతలోనే ఐశ్వర్య తన బంధువులు, మైలార్‌దేవుపల్లి పోలీసులతో అక్కడ ప్రత్యక్షమైంది. పృథ్వీ తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, ఇపుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. పెళ్లిని ఆపాలని కోరింది. రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌ ఆదేశాలతో మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ మధు పృథ్వీరాజ్‌ను అరెస్ట్‌ చేశారు. అతనిపై చీటింగ్‌, అత్యాచారం కేసులను నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఏసీపీ కార్యాలయానికి చేరుకున్న పెళ్లి బంధువులు

పెళ్లి జరిగే సమయంలో పెళ్లి కుమారుడి అరె్‌స్టతో వరుడు, వధువు కుటుంబీకులు, బంధువులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. తమకు తెలిసిన నాయకులు, స్థానికులతో కలసి రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్నాం.. అన్ని వస్తువులు కొన్నాం.. బంధువులూ వచ్చారు వరుణ్ణి వదిలిపెట్టాలని పోలీసులను ప్రాధేయపడ్డారు. అయితే, ఐశ్వర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఆమె ఒప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని పోలీసులు పేర్కొన్నారు. దీంతో బంధువులు ఐశ్వర్యతో సంప్రదింపులు చేయడానికి ప్రయత్నించారు. అయితే, ఆమె ససేమిరా అనడంతో పృథ్వీరాజ్‌ కటకటాల పాలయ్యాడు.

Updated Date - 2023-02-25T11:58:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising