ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Protocol: మోదీ పర్యటనలో ప్రోటోకాల్ రగడ..

ABN, First Publish Date - 2023-04-06T09:32:59+05:30

మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా..రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వస్తారా లేదా అనేది రాష్ట్ర రాజకీయాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ఈ నెల 8న హైదరాబాద్‎కు(Hyderabad) ప్రధాని మోదీ(Prime Minister Modi) రానున్నారు. శనివారం ఉదయం 11.30గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‎పోర్ట్‎కు(Begumpet Airport) వచ్చిన తర్వాత ప్రధాని 11.35 గంటలకు బేగంపేట్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‎కు(Secunderabad Railway Station) చేరుకోనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైల్(Secunderabad-Tirupati Vande Bharat Rail) ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా.. మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా..రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Chief Minister Kalvakuntla Chandrasekhar Rao) వస్తారా లేదా అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‎కు(KCR) ఆహ్వానం పంపినట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో మోదీ (Modi) పర్యటించినప్పుడల్లా కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. మోదీ పర్యటనలో ప్రతిసారి సీఎం రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Modis Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్


ప్రధానమంత్రికి స్వాగతం పలికే సాంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరిస్తున్నారని బీజేపీ (BJP) తీవ్ర విమర్శలు చేస్తోంది. దీంతో మరోసారి బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రోటోకాల్ రగడ(Rub the protocol) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల ప్రధాని పర్యటలో షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ కు కొద్దీ సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. శనివారం హైదరాబాద్‎కు భారత ప్రధాని పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మోదీ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడానికి 7నిమిషాల పాటు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. 12.30గంల నుంచి 12.37నిమిషాల వరకు సీఎం కేసీఆర్‎కు ప్రసంగానికి టైమ్ కేటాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అసలు ప్రధాని మోదీ పర్యటనలో కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. చూడాలి మోదీ పర్యటనకు సీఎం హాజరవుతారా చివరకు ఏదైనా కారణం చెప్పి డ్రాప్ అవుతారా అనేది ఇప్పుడు కీలకంగా మారింది.

Updated Date - 2023-04-06T09:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising