Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా ఆర్టీసీ చార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ
ABN, First Publish Date - 2023-04-01T11:18:47+05:30
సామాన్యుడిపై మరో భారం. ఒకవైపు నిత్యావసరాల ధరలు మంట.. మరోవైపు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ(Petrol, Diesel, LPG) ధరలు పెరగడం..ఇలా
హైదరాబాద్: సామాన్యుడిపై మరో భారం. ఒకవైపు నిత్యావసరాల ధరలు మంట.. మరోవైపు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ(Petrol, Diesel, LPG) ధరలు పెరగడం..ఇలా వరుసగా సామాన్యుడికి షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పుడు మరోసారి తెలంగాణ ఆర్టీసీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ చార్జీలను పెంచుతున్నట్లు (TSRTC) ప్రకటించింది. టోల్ చార్జీల(Toll charge) పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా బస్సుల్లో ఆర్టీసీ బస్సు(RTC bus) టికెట్ చార్జీలను(Ticket charges) పెంచింది. ఒక్కో టోల్‌తో రూ. 5 నుంచి అదనంగా టికెట్ చార్జీలు వసూలు చేస్తోంది. కొన్ని బస్సులకి రూ. 10 చొప్పున పెంపు. అదనపు టోల్‌కి..అదనపు చార్జ్. ఉదయం నుండి అన్ని బస్సుల్లో టికెట్ ఛార్జీలను ఆర్టీసీ సామాన్యుడిపై మరింత భారం వేసింది. ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా..ఏకంగా బస్ భవన్ నుండి వాట్సాప్(WhatsApp) ద్వారా ఆర్టీసి ఉద్యోగులకు సమాచారం ఇచ్చి ఆర్టీసీ చార్జీలు పెంచండంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రకటన చేయకుండా టీఎస్ ఆర్టీసీ చార్జీలను పెంచడంపై స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
నేటి నుంచి టోల్ బాదుడు
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్‌గేటు ఫీజులు పెంచుతూ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో వాహనదారులపై అదనపు భారం పడనుంది. అగనంపూడి టోల్‌గేటు వద్ద శనివారం నుంచి పెంచిన ఫీజులను వసూలుచేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. గతంతో పోలిస్తే ఐదు శాతంపైగా ఫీజులను పెంచుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రేట్లకు కార్లు, జీపులకు అదనంగా రూ.5 నుంచి రూ.10 వరకు పెంచుతున్నారు. అలాగే బస్సులు, లారీలకు రూ.15 నుంచి రూ.25 వరకు, భారీ వాహనాలకు రూ.40 నుంచి రూ.50 వరకు పెంచనున్నారు. అలాగే నెలవారీ జారీచేసే పాస్ ధరలను పెంచుతూ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఆదేశాలు జారీచేశారు
Updated Date - 2023-04-01T11:19:42+05:30 IST