TS NEWS: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో 11 మంది నిందితులకు జైలు శిక్ష
ABN, First Publish Date - 2023-10-26T21:33:06+05:30
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో 11 మంది నిందితులకు ఢిల్లీ NIA కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. కుట్ర కేసులో ఒబెద్ ఉర్ రెహమాన్‌తో పాటు 10మందికి జైలు శిక్ష విధించింది.
ఢిల్లీ: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో 11 మంది నిందితులకు ఢిల్లీ NIA కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. కుట్ర కేసులో ఒబెద్ ఉర్ రెహమాన్‌తో పాటు 10మందికి జైలు శిక్ష విధించింది. రెహమాన్ గ్యాంగ్ విదేశాల నుంచి పేలుడు పదార్థాలు తెచ్చింది. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలు తెచ్చి భారత్‌లో రెహమాన్ పేలుళ్లకు కుట్రకు తెరలేపింది. అయితే పేలుళ్ల కుట్ర కేసును తెలంగాణ పోలీసులు ముందస్తుగా భగ్నం చేశారు. 2012 పాకిస్థాన్ నుంచి భారత్‌కు పేలుడు పదార్థాలు తెచ్చి దాడులకు యత్నించిన కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 11 మందిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. జూలైలో నలుగురు నిందితులు దినేష్ అన్సారి, ఆఫ్తాబ్ అలామ్, ఇమ్రాన్ ఖాన్, ఒబైద్ ఉర్ రెహమాన్‌లకు పదేళ్ల జైలు కోర్టు శిక్ష విధించింది. తాజాగా ఐదో నిందితుడు మగ్బూల్‌కి జైలు శిక్ష విధించింది. కేసులో మరో ఆరుగురు నిందితులకు కోర్టులో ట్రయల్ కొనసాగుతుందని ఎన్‌ఐఏ పేర్కొంది.
Updated Date - 2023-10-26T21:33:06+05:30 IST