ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Kavitha : ఎల్లుండి జంతర్ మంతర్ వద్ద కవిత నిరహార దీక్ష ఉంటుందా?

ABN, First Publish Date - 2023-03-08T12:10:40+05:30

ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. కవిత ఇంటికి వెళ్ళే రెండు రహదారులను బ్యారికేడ్లతో మూసివేశారు. కవిత ఇంటికి కార్యకర్తలు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఎల్లుండి జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరహార దీక్ష చేస్తారా? లేదా? అనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇంటి వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. కవిత ఇంటికి వెళ్ళే రెండు రహదారులను బ్యారికేడ్లతో మూసివేశారు. కవిత ఇంటికి కార్యకర్తలు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. జాగృతి కార్యకర్తలను బారికేడ్ల వద్దే పోలీసులు అడ్డుకుంటున్నారు. కాగా.. ఎల్లుండి జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద ఎమ్మెల్సీ కవిత నిరహార దీక్ష చేస్తారా? లేదా? అనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఆమె దీక్ష చేయనున్నారు. ఈ దీక్షను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechuri) ప్రారంభించనున్నారు.

దీక్షా కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పలు విపక్ష పార్టీలకు చెందిన నేతలు పాల్గొనున్నారు. కవిత దీక్షకు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) హాజరుకానున్నారు. దీక్ష ముగింపునకు సీపీఐ కార్యదర్శి డి రాజా హాజరుకానున్నారు. కవిత దీక్షకు సంఘీభావంగా దేశంలోని 18 పార్టీలకు చెందిన నేతలు ఆయా పార్టీల బృందాలు పాల్గొననున్నాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి దీక్షలో వివిధ మహిళా సంఘాలు, మహిళా హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు పాల్గొననున్నాయి. కవిత దీక్షకు ప్రత్యేకంగా రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ హాజరుకానున్నారు.

Updated Date - 2023-03-08T13:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising