Share News

KCR: కేసీఆర్ తుంటి బాల్ డ్యామేజ్ అయినట్లు గుర్తించిన వైద్యలు

ABN , First Publish Date - 2023-12-08T10:10:01+05:30 IST

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం అర్ధరాత్రి ఫామ్ హౌస్‌ బాత్ రూమ్‌లో జారి పడ్డారు. దీంతో ఆయన తొంటికి తీవ్ర గాయమైంది. కుటుంబసభ్యులు ఆయనను యశోద ఆస్పత్రికి తరలించారు.

KCR: కేసీఆర్ తుంటి బాల్ డ్యామేజ్ అయినట్లు గుర్తించిన వైద్యలు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (Ex CM KCR) గురువారం అర్ధరాత్రి ఫామ్ హౌస్‌ (Farm house) బాత్ రూమ్‌లో జారి పడ్డారు. దీంతో ఆయన తొంటికి తీవ్ర గాయమైంది. కుటుంబసభ్యులు ఆయనను యశోద ఆస్పత్రి (Yashoda Hospital)కి తరలించారు. పరీక్షించిన డాక్టరు.. తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్లు గుర్తించారు. ఈ రోజు పదకొండు గంటలకు శస్త్ర చికిత్స చేయనున్నారు. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్స్ వేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. తుంటి బాల్ కూడా డ్యామేజ్ అయినట్లు వైద్య బృందం గుర్తించింది. కాగా హాస్పిటల్‌లో కేసీఆర్ వెంట కవిత, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-12-08T10:10:04+05:30 IST