ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR: మోదీపై సంచలన వ్యాఖ్యలు.. ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తా

ABN, First Publish Date - 2023-02-12T16:18:33+05:30

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi)పై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi)పై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) విమర్శలు గుప్పించారు. మోదీకి సలహాలు ఇచ్చేవాళ్లు సరిగ్గా ఇవ్వడం లేదని, ఏదైనా తప్పుజరిగితే ఒప్పుకునే ధైర్యం ఉండాలని కేసీఆర్‌ అన్నారు. గోద్రాపై బీబీసీ (BBC) తీసిన డాక్యుమెంటరీని బ్యాన్‌ చేశారని, ఏకంగా బీబీసీనే బ్యాన్‌ చేయాలని కోర్టులో పిటిషన్‌ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీసీ (BBC) అంటే జీ (ZEE) న్యూసా ఈడీ దాడులు చేయగానే బంద్‌ చేయడానికి, బీబీసీ... నీ ఈడీ, బోడీలకి భయపడుతుందా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఈ అధికారం ఎన్ని రోజులు ఉంటుంది?, 2024 తర్వాత అంతా కుప్పే మిగులుతుందని, గతంలో ఇందిరను దుర్గామాత అంటూ వాజ్ పేయీ పొగిడారని కేసీఆర్ అన్నారు. ఇందిర జీవితాన్ని ఓ కోర్టు తీర్పు మలుపు తిప్పిందని, ఇందిరను కూడా ప్రజలు ఇంటికి పంపారని కేసీఆర్‌ గుర్తు చేశారు.

పనితీరు బాగా లేకున్నా మోదీని పొగుడుతున్నారని, ఎల్ఐసీ (LIC)ని అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. నష్టం వస్తే సమాజం నెత్తిన.. లాభం వస్తే ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారని, ఎయిర్‌ ఇండియాను మళ్లీ టాటాలకు అప్పగించారని కేసీఆర్‌ ఆరోపించారు. మోదీ హయాంలో ఏ రంగంలోనైనా వృద్ధి జరిగిందా?, కాంగ్రెస్‌ హయాంలో వార్షిక వృద్ధి రేటు 6.8, కానీ మోదీ వచ్చాక మన వృద్ధి రేటు 5.8కి పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ (UPA) హయాంలో వృద్ధిరేటు 24 శాతం ఎక్కువ అని, కాంగ్రెస్‌ పాలనలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.7 ఉండగా, మోదీ పాలనలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 7.1 ఉందని, మోదీ పాలనలో సగానికి సగం పడిపోయిందని కేసీఆర్‌ మండిపడ్డారు. ప్రధాని మోదీకి ఓట్లు కావాలంటే బియ్యం ఫ్రీ అంటారని, మేకిన్‌ ఇండియా జోకింగ్‌ ఇండియాగా మారిందని కేసీఆర్‌ అన్నారు.

తాను చెప్పిన లెక్కలన్నీ వాస్తవాలు.. ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తానని కేసీఆర్ తెలిపారు. తన మాటకు కట్టుబడి ఉంటానని, అభివృద్ధిపై మాట్లాడే హక్కు మోదీకి లేదని, దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోదీయే అని కేసీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో లైసెన్స్‌ రాజ్‌.. మోదీ హయాంలో సైలెన్స్‌ రాజ్‌ అని, రూ.20 లక్షలు కోట్లు ఎంఐఎంఈ (MIME)లకు ఇచ్చామన్నారని,.. ఎవరికి ఇచ్చారు? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్డీఏ (NDA) అంటే నో డాటా అవైలబుల్‌ అని చిదంబరం అన్నారని కేసీఆర్‌ గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి మోదీ ఫోటో కోసం రేషన్‌ డీలర్‌తో కొట్లాడతారా?, ఏం సాధించారని మోదీ ఫోటో పెట్టుకోవాలని కేసీఆర్‌ అసెంబ్లీలో నిలదీశారు. దేశంలో మోదీ తెచ్చిన ఏ పాలసీ అయినా సక్సెస్‌ అయ్యిందా?, నోట్ల రద్దు సక్సెస్‌ అయ్యిందా?, ఇప్పుడు మనీ సర్క్యూలేషన్‌ పెరిగిందని, కేంద్రం దగ్గర దేనికీ లెక్కలుండవని, ఎన్‌పీఏ (NPA)ల పేరుతో లక్షల కోట్లు మాఫీ చేశారని కేసీఆర్‌ మండిడ్డారు.

Updated Date - 2023-02-12T17:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising