Kishan Reddy: విలువైన స్థలాలు వేలంలో వ్యాపారుల పాలు
ABN, First Publish Date - 2023-08-15T02:34:43+05:30
మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణను రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన బీఆర్‌ఎస్ సర్కారు.. ఆదాయమే లక్ష్యంగా విలువైన ప్రభుత్వ భూములను అమ్మేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
భూములు అమ్మడమే ఏకైక లక్ష్యం
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కూ ఖరీదైన జాగాలు
పూర్తిగా అధికార దుర్వినియోగం: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణను రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన బీఆర్‌ఎస్ సర్కారు.. ఆదాయమే లక్ష్యంగా విలువైన ప్రభుత్వ భూములను అమ్మేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న అత్యంత ఖరీదైన స్థలాలను పెద్ద పెద్ద వ్యాపా రులకు వేలం ద్వారా కట్టబెడుతోంద ని విమర్శించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోకాపేట, బుద్వేల్, ఖాజాగూడ, మన్నెగూడ, ఆదిభట్ల లాంటి అనేకచోట్ల ప్రభుత్వ భూ ములను వేలంలో అమ్ముతున్నారని.. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమేనన్నారు. ఎకరం రూ.100 కోట్లు పలికే కోకాపేటలో బీఆర్‌ఎస్ ఆఫీసు కోసం 11 ఎకరాలు కేటాయించుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. బోయినపల్లి గ్రామంలో కాంగ్రె్‌సకు 10 ఎకరాల స్థలం కేటాయిస్తూ ఏప్రిల్ 28న జీవో ఇచ్చారని తెలిపారు.
కాంగ్రె్‌సకు ఏ ప్రాతిపదికన భూమి ఇచ్చామో.. తామూ అదే ప్రాతిపదికన తీసుకున్నామని నిస్సిగ్గుగా జీవోలో చెప్పుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కై రూ.వందల కోట్ల విలువ చేసే భూము లను అక్రమంగా తీసుకున్నాయని విమర్శించారు. నాలు గు నెలల తర్వాత తాము అధికారంలోకి రాగానే.. ఆ కేటాయింపులను రద్దు చేస్తామని చెప్పారు. రైల్వే టర్మినల్స్, చర్లపల్లిలో రైల్వేస్టేషన్ విస్తరణకు స్థలం కావాలని ఎన్నిసార్లు కోరినా.. బీఆర్‌ఎస్ సర్కారు ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లకోసం, కేంద్ర ప్ర భుత్వ సంస్థల భవనాలను నిర్మించేందుకు స్థలం ఇవ్వా లని తాను ఎన్నిసార్లు లేఖ రాసినా బీఆర్‌ఎస్ సర్కారుకు భూమి దొరక లేదని విమర్శించారు. పేదలకు ఇళ్లు నిర్మించేందుకు స్థలాలు దొరకవు కానీ.. పార్టీలకు, వ్యాపారులకు కట్టబెట్టేందుకు వందల కోట్ల విలువైన భూములు దొరుకుతాయని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Updated Date - 2023-08-15T02:56:26+05:30 IST