ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy: కేసీఆర్‌కు అత్యుత్సాహం ఎక్కువైంది

ABN, First Publish Date - 2023-09-02T19:03:51+05:30

ఎన్నికల షెడ్యూల్(Election Schedule) రాకముందే సీఎం కేసీఆర్‌కు(CM KCR) అత్యుత్సాహం ఎక్కువైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఎద్దేవ చేశారు.

హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్(Election Schedule) రాకముందే సీఎం కేసీఆర్‌కు(CM KCR) అత్యుత్సాహం ఎక్కువైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఎద్దేవ చేశారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘కుల సంఘాల పెద్దలు, వెనుకబడిన తరగతుల వారు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదు.వారికి న్యాయం చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది. గజ్వేల్ చూడటానికి వెళ్తే భయం ఎందుకు?గజ్వేల్ అభివృద్ధి జరిగితే, అక్కడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వస్తే, దళితబంధు అందరికీ వస్తే కేసీఆర్‌కు భయం ఎందుకు పట్టుకుంది.

గజ్వేల్ ఏమైన మీ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీనా..?గజ్వేల్ నిజం రాసిచ్చినడా..? లేక ఒవైసీ రాసిచ్చినడా..?. ఇలాంటి చేష్టలను చేస్తే చూస్తు ఊరుకునేది లేదు. బీజేపీ ఆషామాషీ పార్టీ కాదని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలి.కేసీఆర్ పథకాలు అన్ని రివర్స్ కొడుతున్నయి. దళితబంధు, బీసీబంధు, అన్ని ఫెయిల్ అయ్యాయి. కేసీఆర్ టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు దళిత బంధులో 30% కమీషన్ తీసుకున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవన్ని ఘనంగా నిర్వహిస్తాం. తెలంగాణకు నిజాం నుంచి స్వేచ్ఛ వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. గ్రామగ్రామాన బీజేపీ తరపున నిర్వహిస్తాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-02T19:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising