Komatireddy: ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
ABN , First Publish Date - 2023-10-25T13:00:21+05:30 IST
హైదరాబాద్: ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌లో చాలా మంది చేరుతున్నారని, తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక విషయం తనతో మాట్లాడలేదని.. అధిష్టానంతో మాట్లాడారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ (Congress)లో చాలా మంది చేరుతున్నారని, తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) కాంగ్రెస్‌లో చేరిక విషయం తనతో మాట్లాడలేదని.. అధిష్టానంతో మాట్లాడారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komatireddy Venkat Reddy) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడే కాదని.. చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని, కర్ణాటక (Karnataka)లో హామీ ఇచ్చిన పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. సెకండ్ లిస్ట్ (Second List) ఈరోజు పూర్తవుతుందని, రేపు విడుదల అవుతుందని చెప్పారు. 6 స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని, అక్కడ ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారని ఆయన అన్నారు.
సీఈసీ (CEC) ఫైనల్ అయ్యేవరకు బయట మాట్లాడకూడదని, గతంలోనే కాళేశ్వరం (Kaleswaram)పై విచారణ జరపాలని ప్రధానికి లేఖ రాసామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వామపక్షాలకు నాలుగు సీట్లు అంటే తక్కువ కాదని, మిర్యాలగూడలో కూడా అడిగారని, అక్కడ ఓటు ఎంత వరకు ట్రాన్స్‌ఫర్ అవుతుందనేది చూడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 80 సీట్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తులపై బుధవారం సాయంత్రం క్లారిటీ వస్తుందన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేరు చెప్పే అర్హత కేటీఆర్ (KTR)కు లేదని, రాహుల్ గాంధీ కుటుంబానికి ఇల్లు కూడా లేదని, ఇప్పుడు మీ ఆస్తులెంత కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.