Lakshman: మోదీపై కల్వకుంట్ల కుటుంబ సభ్యుల అక్కసు..
ABN, First Publish Date - 2023-09-27T14:17:25+05:30
హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబానికి అసహనం ఎక్కువైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక్క గ్రూప్ వన్ పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు.
హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబానికి అసహనం ఎక్కువైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Lakshman) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.) ఒక్క గ్రూప్ వన్ (Group 1) పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు. ప్రధాని మోదీ (PM Modi) మీద కల్వకుంట్ల కుటుంబ సభ్యులు (Kalvakuntla family members) అక్కసు వెళ్ళగక్కుతున్నారని, ఎన్డీయే (NDA) హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటులో ప్రజలకు నష్టం జరగలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ (Congress) తప్పును ఎత్తి చూపితే.. బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. కృష్ణ జలాల వాటా కోసం మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.
పాలమూరు ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt.) మోసం చేసిందని, నార్లపల్లి రిజర్వాయర్ వద్ద ఒక్క మోటార్ మాత్రమే ప్రారంభించి.. రంగురంగుల సినిమాలు చూపిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వం... లిక్కర్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. బీసీ వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిని చేస్తారా? ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను ఆయన ప్రశ్నించారు. కమీషన్ల కోసమే బీసీ బంధు ఇస్తున్నారని, దళిత బందుకు రూ. 10 లక్షలు ఇస్తే.. బీసీ బంధుకు లక్ష రూపాయలు మాత్రమేనా? అని నిలదీశారు. బీసీ సబ్ ప్లాన్ (BC Sub Plan) ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ (Governor) విషయంలో పోటీ పడి విమర్శలు చేస్తున్నారని, ఎమ్మెల్సీగా సిఫార్సు చేసిన వారు ఆర్టికల్ ప్రకారం అనర్హులని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-09-27T14:17:25+05:30 IST