ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lakshman: చంద్రబాబును అలా.. అరెస్ట్ చేయాల్సింది కాదు

ABN, First Publish Date - 2023-09-11T17:19:34+05:30

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) పేరు ఎఫ్ఐఆర్‌(FIR)లో చేర్చకుండా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఎంపీ, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్(Lakshman) తప్పుపట్టారు.

ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) పేరు ఎఫ్ఐఆర్‌(FIR)లో చేర్చకుండా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఎంపీ, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్(Lakshman) తప్పుపట్టారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘చంద్రబాబు అరెస్ట్ సబబు కాదు. తెలంగాణలో నవంబర్‌ లేదా డిసెంబర్‌లో అసెంబ్లీ, మార్చి లేదా ఏప్రిల్‌లోలోక్ సభ ఎన్నికలు జరుగుతాయి.జమిలీ ఎన్నికలు(Jamili elections) జరిపేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి.ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయో మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్(Ram Nath Kovind) నివేదిక వచ్చాక స్పష్టత వస్తుంది. పార్లమెంట్‌లో పెట్టె అందరి అభిప్రాయాన్ని తీసుకొని నిర్ణయం ఉంటుంది. బీఅరెస్ అవినీతి పాలనకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చరమగీతం పాడుతారు. యువతను ఆగం పట్టించి గారడీ చేస్తున్నాడు. నిరుద్యోగ యువత భవిష్యత్‌ను అంధకారంలో నెట్టారు.

3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా 30 లక్షల మంది యువతను దగా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో కేసీఆర్‌కి యువత బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాటాన్ని బీజేపీ ఉధృతం చేసింది. 30 లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఇవ్వలేదు. రాజకీయ కొలువుల భర్తీపై ఉండే శ్రద్ధ.. ఉద్యోగ భర్తీపై లేదు.పేపర్ లీకేజీ పేరుతో నిరుద్యోగ యువత జీవితాలతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆడుకున్నారు. మంత్రి కేటీఆర్ పేపర్ లీకేజీ అంశంలో రాజీనామా చేయకుండా ఒకరిద్దరిపై తప్పును నెట్టి తప్పించుకున్నారు. 12వ తేదీన జాబ్ కాలెండర్ విడుదల, ఖాళీల భర్తీ చేయాలంటూ 24 గంటలపాటు దీక్ష చేపట్టనున్నాం. 12వ తేదీన ఇందిరా పార్కు వేదికగా 11 గంటలకు దీక్ష ప్రారంభం అవుతుంది. యువత పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చెయాలి. ఉపాధ్యాయుల భర్తీలు చేపట్టక సర్కార్ బడులన్నీ మూసేసి స్థితికి తీసుకొచ్చారు. చదువుకునే పరిస్థితి నుంచి.. చదువుకొనే పరిస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని పేదప్రజాలకు కానుకగా ఇవ్వబోతున్నారు. ‘‘ధన్యవాద్ మోడీజీ’’ పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తాం’’ అని లక్ష్మణ్ తెలిపారు.

Updated Date - 2023-09-11T17:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising