ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mallu ravi: విజయశాంతి కాంగ్రెస్‌లో చేరికపై మల్లు రవి ఏమన్నారంటే..!

ABN, First Publish Date - 2023-11-11T17:43:39+05:30

బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) పార్టీ మార్పుపై పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి (mallu ravi) కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) పార్టీ మార్పుపై పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి (mallu ravi) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి లాంటి వారు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అత్యంత విజయవంతంగా కాంగ్రెస్‌ పార్టీ నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసింది. 85-95 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. 30న ఓట్ల యుద్ధంలో బీజేపీ (BJP), బీఆర్ఎస్‌లను (BRS) ఓడించాలని ముందుకు వస్తున్నారు. ఆరు గ్యారంటీ స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయి. డిసెంబర్ 3 తేదీ తర్వాత 3 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. డిసెంబర్ 9న మొదటి కేబినెట్ మీటింగ్ ఉంటుంది. ఇచ్చిన గ్యారంటీస్ 100 రోజుల్లో అమలు చేస్తాం. తాజాగా వస్తున్న సర్వేలు వార్ వన్ సైడ్ కాంగ్రెస్ (Congress) వస్తుందని చెబుతున్నాయి. కంటోన్మెంట్‌లో గద్దర్ కూతురు వెన్నెలని గెలిపించడానికి కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పని చేస్తున్నారు.’’ అని మల్లు రవి తెలిపారు.

Updated Date - 2023-11-11T17:48:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising