ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Rajanarsimha: పీహెచ్‌సీలను బలోపేతం చేయాలి

ABN, Publish Date - Dec 26 , 2023 | 09:34 PM

ప్రైమరీ హెల్త్ సెంటర్ల (PHC) ను బలోపేతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ ( Minister Damodara Rajanarsimha ) తెలిపారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్: ప్రైమరీ హెల్త్ సెంటర్ల (PHC) ను బలోపేతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ ( Minister Damodara Rajanarsimha ) తెలిపారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రాష్ట్రంలో అమలవుతున్న వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల అధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్పత్రులల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా అధికారులు సమర్థవంతంగా కృషి చేయాలి. పల్లె దవాఖాన, బస్తీ దవాఖానల పనితీరు మెరుగుపరుచుకోవాలి. మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేయాలి. అర్హులైన నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇచ్చి సహజ డెలివరీలు జరిగేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చొరవ చూపాలి. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా అవసరమైన వారికి రక్త నమూనాలను సేకరించి రోగ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలి. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్‌ల నివారణకు అవసరమైన మందులు, పరీక్షలను అందుబాటులో ఉంచాలి. టీబీ , కుష్టు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలి. గ్రామ సభల ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలి. నేషనల్ హెల్త్ మిషన్‌పై ఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు.


ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట

‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉండి వారి ఆరోగ్యానికి, ముఖ్యంగా గర్భిణులకు అవసరమైన పోషకాహారం పై అవగాహన కల్పిస్తూ, వారికి సరైన మందులు అందిస్తూ, బాలింత, శిశు మరణాలను తగ్గించేందుకు వారు చేస్తున్న కృషిని మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రులల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు అధికారులు కృషి చేయాలి. అర్హులైన నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్‌ను ఇచ్చి ప్రభుత్వ ఆస్పత్రులలో సహజంగా డెలివరీ‌లు జరిగేలా చర్యలు చేపట్టాలి. మాతా శిశు సంరక్షణకు చర్యలు చేపట్టాలి. చైల్డ్ హెల్త్‌లో భాగంగా టీకాలు అందేలా చర్యలు చేపట్టాలి’’ అని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

టెస్టులు వేగవంతం చేయాలి

‘‘తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా అవసరమైన శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులు వేగవంతం చేయాలి. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా అమలవుతున్న పల్లె , బస్తీ దవాఖాన, పీహె‌చ్‌సీల పనితీరును మెరుగుపరచుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలి. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్‌ల నివారణకు అవసరమైన మందులు, పరీక్షలను అందుబాటులో ఉంచాలి.TB , కుష్టు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలి. గ్రామ సభల ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలి’’ అని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ ఆర్వీ కణ్ణన్, అదనపు డైరెక్టర్ డాక్టర్ అమర్‌సింగ్, జేడీలు డాక్టర్ పద్మజ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ రాజేశం, డాక్టర్ జాన్ బాబు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసాద్ ,డాక్టర్ నందిత, డాక్టర్ శ్రీదేవి డాక్టర్ సుమిత్ర, CAO, CEO లు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 09:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising