ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Venkat Reddy: హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం

ABN, Publish Date - Dec 23 , 2023 | 10:14 PM

తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) నూతన భవన నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్ బాబు తెలిపారు. రాజేంద్రనగర్ మండలంలో హైకోర్టు భవనానికి కేటాయించిన 100 ఎకరాల స్థలాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి‌రెడ్డి వారితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి, జస్టిస్ టి. వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయసేనా రెడ్డి కూడా పరిశీలించారు.

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) నూతన భవన నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్ బాబు తెలిపారు. రాజేంద్రనగర్ మండలంలో హైకోర్టు భవనానికి కేటాయించిన 100 ఎకరాల స్థలాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి‌రెడ్డి వారితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి, జస్టిస్ టి. వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయసేనా రెడ్డి కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) మాట్లాడుతూ... గత ప్రభుత్వం ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి కావల్సిన మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు అందాల్సిన న్యాయ సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీపడకుండా అద్భుతంగా హైకోర్టును నిర్మిస్తాం. జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారు. భవన నిర్మాణం కక్షిదారులకు, న్యాయమూర్తులకు, న్యాయవాదుల అవసరాలకు సరిపడేలా, సకల సౌకర్యాలతో, ఆధునిక పద్ధతుల్లో హైకోర్టు నిర్మాణం ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Dec 23 , 2023 | 10:14 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising