ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: పీవీని అవమానించిన కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కే లేదు

ABN, First Publish Date - 2023-11-25T16:48:09+05:30

రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉద్యమం చేశారా? ఉద్యోగం చేశారా..?, ఎన్నడూ ఉద్యమం చేయని రాహూల్ గాంధీ యువత గురించి మాట్లాడటం హాస్యాస్పదం. రాహుల్ ఒక రాజకీయ నిరుద్యోగి. ఆయన ఉద్యోగం కోసం నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి

హైదరాబాద్: పీవీ.నరసింహారావు పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. కేటీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘పీవీ లాంటి గొప్ప నాయకుడిని ఘోరంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్. ప్రధానిగా పనిచేసిన నాయకుడికే పార్టీ టికెట్ కూడా ఇవ్వకుండా అవమానించలేదా..?, పీవీ పార్థీవదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి రానివ్వకుండా అవమానించిన సంగతిని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. దేశ నాయకుడికి ఢిల్లీలో మోమోరియల్ కూడా నిర్మించకుండా అడ్డుకున్నది కాంగ్రెస్సే. పీవీ కుటుంబానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు శతజయంతి ఘనంగా జరిపింది.. గొప్పగా గౌరవించుకుంది. భారతరత్న ఇవ్వాలని కోరింది.. తీర్మానాలు చేసింది.’’ అని చెప్పుకొచ్చారు.

‘‘రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉద్యమం చేశారా? ఉద్యోగం చేశారా..?, ఎన్నడూ ఉద్యమం చేయని రాహూల్ గాంధీ యువత గురించి మాట్లాడటం హాస్యాస్పదం. రాహుల్ ఒక రాజకీయ నిరుద్యోగి. ఆయన ఉద్యోగం కోసం నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. డొల్లమాటలు.. కల్లబొల్లి కబుర్లు తప్ప చిత్తశుద్ధి లేదు. కర్ణాటకలో 100 రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాల మాటిచ్చి.. ఆర్నెళ్లు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ దిక్కులేదు. తొమ్మిదన్నర ఏళ్లలో 1,60,083 ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత మాది. దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలి.’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-25T17:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising