ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: మాకు ఈ ఎన్నికల్లో 88 అసెంబ్లీ సీట్లు రావచ్చు

ABN, First Publish Date - 2023-10-13T21:00:07+05:30

2018 ఎన్నికల్లో వచ్చినట్టే ఈ ఎన్నికల్లో కూడా 88 అసెంబ్లీ సీట్లు మా పార్టీకి రావచ్చని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు(Minister KTR) అన్నారు.

హైదరాబాద్: 2018 ఎన్నికల్లో వచ్చినట్టే ఈ ఎన్నికల్లో కూడా 88 అసెంబ్లీ సీట్లు మా పార్టీకి రావచ్చని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు(Minister KTR) అన్నారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ సీఎం కేసీఆర్ ఈసారి కూడా వంద స్థానాల్లో ప్రచారం చేస్తున్నారు. నేను జీహెచ్ఎంసీ, సిరిసిల్లాతో పాటు కామారెడ్డిలో ప్రచారం చేస్తాను.మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తాం.అట్టడుగు వర్గాలకు బీఆర్ఎస్ ఊత కర్రలా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణలో మేమే ముందు ఉన్నాం. ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి కాదు ఈ ఎన్నికలు జరుగుతున్నది. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి’’ అని మంత్రి కేటీఆర్ చెప్పారు..

ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పని చేయాలి..

‘‘ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణలో స్వతంత్రంగా పని చేస్తుందని భావిస్తున్నా. నేను వ్యక్తిగతంగా సిరిసిల్లలో ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయొద్దని నిర్ణయించా. మిగతా వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్లిష్టం. కాంగ్రెస్ 2004 ,2009లలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. మేము 95 శాతం వరకు మా మేనిఫెస్టోలోని హామీలు నిలబెట్టుకున్నాం. రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లగలుగుతారనే అంశంపైనే ఎన్నికలు జరుగుతాయి. మేము తొమ్మిదిన్నరేళ్లుగా చేసిన అభివృద్ధి పనుల గురించి చెబుతున్నాం. ప్రోగ్రెస్ రిపోర్టు లాగా ప్రజలకు అన్నీ వివరిస్తున్నాం. మా కంటే మెరుగైన పాలనా నమూనా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా..? నీతిఅయోగ్, ఆర్బీఐ రిపోర్టుల అన్నీ సూచీల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది.ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించేది ప్రజలే.. అధికారులు కాదు. అధికారుల బదిలీలను బదిలీలలుగా గానే చూస్తాం. ప్రజలు ఓటేసేటప్పుడు సీఎం ఎవరుంటారనే చూస్తారు. కేసీఆర్ పాలన తీరుపైనే ప్రజలు తీర్పు ఇస్తారు. మేము చేసింది చెప్పుకుంటాం’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-13T21:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising