ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Sridhar Babu: ప్రజాదర్బార్‌‌లో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం

ABN, First Publish Date - 2023-12-11T21:53:09+05:30

ప్రజాదర్బార్‌‌లో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఐటీ పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) తెలిపారు. సోమవారం నాడు నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజాదర్బార్‌లో మంత్రి వినతులు స్వీకరించారు.

హైదరాబాద్: ప్రజాదర్బార్‌‌లో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఐటీ పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) తెలిపారు. సోమవారం నాడు నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజాదర్బార్‌లో మంత్రి వినతులు స్వీకరించారు. విజ్ఞాపనదారుల సౌకర్యార్థం ప్రజాదర్బార్ నిర్వహణకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రజాదర్బార్ నిర్వహణను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమన్వయం చేశారు. ఆయుష్ విభాగం డైరెక్టర్ హరిచందన, సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...దరఖాస్తుదారులు తమ విజ్ఞాపనపత్రంలో సమస్యతో పాటు అడ్రస్, ఫోన్ నంబర్‌ను రాయాలని సూచించారు. తద్వారా దరఖాస్తుదారుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడానికి వీలవుతుందని తెలిపారు.

ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న టీఎస్ జెన్కో జేఈ( TS Genco AE ) పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అదే రోజు రెండు, మూడు పరీక్షలు ఉన్నట్లు అభ్యర్థులు మంత్రికి వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. సంబంధితశాఖ అధికారులతో చర్చించి టీఎస్ జెన్కో జేఈ( TS Genco AE ) పరీక్ష వాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రతి నెలా రెగ్యులర్‌గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు విజ్ఞాపన పత్రం అందజేశారు. అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్దలు, వివిధ వర్గాలతో నెల రోజుల పాటు ప్రజా సమస్యలను కూలంకషంగా చర్చించి మ్యానిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-11T21:53:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising