ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Srinivas Goud: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు

ABN, First Publish Date - 2023-07-19T15:31:34+05:30

బీసీ నేతలపై కాంగ్రెస్ పార్టీ బరితెగించి మాట్లాడుతుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: బీసీ నేతలపై కాంగ్రెస్ పార్టీ బరితెగించి మాట్లాడుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తేల్చుకోవటానికి బీసీ నేతలు సిద్దమవుతున్నామన్నారు. బీసీ నేతలను అవమానించే వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొంటామన్నారు. బీసీలకు జరుగుతోన్న అవమానంపై కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులు స్పందించాలని కోరారు. ఇందిరా, రాజీవ్‌గాంధీ, సోనియాదగాంధీలను తిట్టినవారు కాంగ్రెస్‌ కు నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతి బీసీ కులాన్ని కించపరిచేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ నాయకత్వాన్ని బలహీనపరిచే కుట్ర కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా బీఆర్ఎస్‌లో ఉన్న బీసీ నేతల‌ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-07-19T15:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising