ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Srinivas Goud: తెలంగాణపై మోడీ విషం కక్కారు

ABN, First Publish Date - 2023-07-08T16:14:55+05:30

తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విషం కక్కారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narender Modi) విషం కక్కారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ (Minister Srinivas Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు విభజన హామీలు నెరవేరుస్తారని ప్రజలంతా ఆశించారని.. తెలంగాణ ఉద్యమంలో అసలు బీజేపీ పాత్ర ఏంటని ప్రశ్నించారు. విశ్వాస ఘాతకుడు మోడీ అంటూ విరుచుకుపడ్డారు. అద్వానీ లాంటి నాయకున్ని అణగదొక్కిన చరిత్ర మోడీది అని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా ఒక చిన్న రిపేర్ కంపెనీ పెట్టారన్నారు. తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ఏపీలో ఏడు మండలాలు కలిపి తెలంగాణకు మోసం చేశారన్నారు. దేశానికి కరువొచ్చినా.. దేశానికి అన్నం పెట్టగలిగే స్థాయిలో తెలంగాణ ఉందని చెప్పుకొచ్చారు. తమర పేర్లు మార్చి పెట్టుకున్న పథకాలు అన్నింటికీ తెలంగాణే కేంద్ర బిందువన్నారు. కర్ణాటకలో అత్యంత అవినీతి చేసింది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. 80 కోట్ల బీసీలు మీరు ప్రధాని అయితే సంతోష పడ్డారని.. కానీ బీసీ మంత్రిత్వ శాఖ లేని ప్రభుత్వం బీజేపీదన్నారు. అవినీతి జరిగి ఉంటే ఇన్ని అద్భుత పథకాలు ఎలా వస్తాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

Updated Date - 2023-07-08T16:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising