ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Srinivas Gowd: బీజేపీ బీసీల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది

ABN, First Publish Date - 2023-10-21T18:34:52+05:30

బీజేపీ(BJP) పార్టీ బీసీల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Minister Srinivas Gowd ) ఎద్దేవ చేశారు.

మహబూబ్‌నగర్: బీజేపీ(BJP) పార్టీ బీసీల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Minister Srinivas Gowd ) ఎద్దేవ చేశారు. మంగళవారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ...‘‘బీసీ ప్రధాని ఉన్నాడు.. బీసీలకు ఏమి చేశాడు. ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు. బీసీ జన గణనకు తావు లేదు. 80 వేల కోట్ల జనాభా ఉన్న బీసీలకు 2 వేల కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి మీరు ఇప్పుడు ఓడిపోయే స్థానాల్లో బీసీలని నిలబెట్టి ఓడించే కుట్ర చేస్తున్నారు. రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ఉంటే.. 33 శాతం బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉండేది. కేవలం ఎమ్మెల్యేలుగా గెలిస్తే బీసీలు అభివృద్ధి చెందుతారా.. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీ గురుకులాలు పెట్టారా.. చట్ట సభల్లో అవకాశం లేకున్నా.. ఎమ్మెల్సీలుగా మేం అవకాశం ఇచ్చాం. ఎమ్మెల్సీలుగా బీసీ, ఎస్టీలకు అవకాశం ఇస్తే.. మీరు గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని అడ్డుకున్నారు. మీరు గెలిచేదే ఐదు సీట్లు లేవు.. మీరు బీసీలకు సీట్లు ఇస్తే గెలుస్తారా.. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే మీరు ఎందుకు ఓబీసీగా ఉన్న బండి సంజయ్‌ని మార్చి కిషన్ రెడ్డిని ఎలా అధ్యక్షుడిగా చేశారు. ఇలాగే గతంలో ఓ పెద్ద మనిషి పోతూ పోతూ.. బీసీని సీఎం చేస్తానని ప్రకటించి పోయారు.. ఏం జరిగింది.

నేడు బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది. ఓడిపోయే స్థానాల్లో బీసీలను నిలబెట్టి ఓడించి.. మీరే ఓడించాలని .. బీసీలు ఓడిపోయారనే అపవాదు పెట్టాలని కుట్ర చేస్తున్నారు. మా పార్టీ సబ్బండ వర్గాలకు అండగా ఉంది. కాంట్రాక్ట్‌లలో.. వైన్ షాపుల్లో బీసీలకు బీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది’’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-21T18:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising