Minister Uttam: అర్హులకు మోడల్ కాలనీలో ఇళ్లు కేటాయిస్తాం
ABN, Publish Date - Dec 23 , 2023 | 05:07 PM
జిల్లాలో 2వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి 100 ఎకరాల స్థలంలో పేదల కోసం కేటాయించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) స్పష్టం చేశారు. శనివారం నాడు సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇళ్లని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
సూర్యాపేట : జిల్లాలో 2వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి 100 ఎకరాల స్థలంలో పేదల కోసం కేటాయించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) స్పష్టం చేశారు. శనివారం నాడు సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇళ్లని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అర్హులకు మోడల్ కాలనీలో ఇళ్లు కేటాయిస్తామన్నారు. పదేళ్లలో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కట్టింది 270 ఇళ్లు మాత్రమే. చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు పనిచేయడం లేదు..100రోజులో అన్నీ పూర్తి చేసి చూపిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
27న తీపికబురు అందుతుంది: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
84 ఎకరాల్లో నిర్మించిన ఇళ్లను ఎంత ఖర్చయినా రానున్న 5నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. శనివారం నాడు మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉప ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసింది. ప్రభుత్వ భూముల రికార్డులు మార్చి కబ్జా చేసిన భూమిని తిరిగి తీసుకొని మళ్లీ పేద ప్రజలకు అందిస్తాం. ఇది ఇందిరమ్మ రాజ్యం పేదల రాజ్యం.గతంలో అమాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా బీఆర్ఎస్ నేతలు మార్చారని, మనం దాని సమర్థవంతంగా మారుస్తూ, అభివృద్ధిలో నడిపిస్తామని అన్నారు. 27వ తేదీన అందరికీ తీపికబురు అందుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మం జిల్లా: పాలేరునియోజకవర్గం కూసుమంచిలో రెవెన్యూశాఖ &గృహనిర్మాణ, సమాచారా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాల ర్యాలీని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిర్వాహించారు.
Updated Date - Dec 23 , 2023 | 05:07 PM