ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ అదృశ్యం

ABN, First Publish Date - 2023-12-09T20:27:01+05:30

మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ అదృశ్యం అయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas Yadav ) ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్‌ మాయం అయినట్లు తెలుస్తోంది. ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్‌ ఎలిజ, వెంకటేష్‌, ప్రశాంత్‌పై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ అదృశ్యం అయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas Yadav ) ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్‌ మాయం అయినట్లు తెలుస్తోంది. ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్‌ ఎలిజ, వెంకటేష్‌, ప్రశాంత్‌పై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఫైల్స్‌ ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.

కాగా.. కార్యాలయంలో ముఖ్యమైన ఫైల్స్‌ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న (శుక్రవారం)నే ఫైల్స్ మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. ఆఫీస్‌లో చెల్లాచెదురుగా ఫైళ్లు పడి ఉండడం అందులో ముఖ్యమైన ఫైళ్లు లేకపోవడంతో అక్కడి అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌ బృందం రంగంలోకి దిగింది. కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఘటనాస్థలంలో డీసీపీ శ్రీనివాస్‌కి కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ ఆధారాలతో డైరెక్టర్‌ను డీసీపీ శ్రీనివాస్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫైల్స్‌ మాయంపై ఎలాంటి సమాచారం లేదని డైరెక్టర్ తెలిపారు. ఫైల్స్‌ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.


విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో ఫైళ్లు మాయం

హైదరాబాద్: కాగా బషీర్ బాగ్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ముఖ్యమైన ఫైళ్లని తస్కరించేందుకు వచ్చారు. అయితే దొంగతనంగా ఫైళ్లని ఆటోలో ఎత్తుకెళ్లారు. గతంలో ఈ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంబర్ ఉండడం గమనార్హం. ఈ విషయం తెలిసి మీడియా అక్కడకు రావడంతో గుర్తుతెలియని వ్యక్తులు పరిగెత్తారు. అక్కడున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-12-09T21:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising