ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Raghunandan Rao: బండి సంజయ్ అరెస్ట్‎పై లీగల్‎గా పోరాడుతాం

ABN, First Publish Date - 2023-04-06T12:52:52+05:30

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అరెస్ట్(arrest) అంశంపై లీగల్‎గా పోరాడుతామని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అరెస్ట్(arrest) అంశంపై లీగల్‎గా పోరాడుతామని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Dubbaka BJP MLA Raghunandan Rao) అన్నారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ..‘‘సంజయ్ ఫోన్‎కి ప్రశాంత్ పేపర్ ఎప్పుడు పంపించారు. శివగణేష్ ఎవరెవరికి ఆ పేపర్ పంపాడు..మీరు విచారణ జరిపించారా?. శివగణేష్ వాట్సాప్ చెక్ చేశారా..సీజ్ చేసి కోర్టుకు సబ్‎మిట్ చేశారా?..రెండు గంటల తర్వాత బండి సంజయ్‎కి వచ్చింది. అంతకంటే ముందే మీడియా ప్రతినిధులు, శాసనసభ్యులు, మంత్రులకు, ఏఏ ఛానెల్స్‎కు వెళ్ళింది. 4, 5వ తేదీన ప్రెస్‎మీట్‎లో చాలా తేడా ఉంది. ప్రభుత్వం పెద్దలు నీ నోట ఒక కథ చెప్పించారు. మీడియా ప్రతినిధి పోలీసులు, రాజకీయ నాయకులకు సమాచారం అందిస్తే అది కుట్ర అని ఆరోపిస్తున్నారు. మీకు మీడియా ప్రతినిధుల నుంచి సమాచారం రాదా..?.నూటికి నూరు శాతం బీజేపీపై(BJP) కక్ష్యపూరితంగా వ్యవహరించడమే. కత్తితో పొడిచిన వ్యక్తి మొదటి ముద్దాయి అవుతాడు..కానీ చంపిన వ్యక్తిని తీసుకుని వెళ్ళిన వారిని మొదటి ముద్దాయి అనరు. వరంగల్ సీపీ రంగనాథ్(Warangal CP Ranganath) తీసిన పేపర్ ఫోటో శివగణేష్ ఫోన్ నుంచి మొదట ఎవరెవరికి వెళ్ళిందో తెలపండి. ఒక పార్టీ పట్ల కక్ష సాధింపుతో వ్యవహారించడం పోలీసులకు మంచిది కాదు..ఎవరిదైనా వ్యక్తి గత సమాచారం కోసం టెలిగ్రాఫ్ చట్టం(Telegraph Act) సెక్షన్ 92పై పోలీసులకు అవగాహన ఉండాలి. జిల్లా న్యాయమూర్తి మాత్రమే ఒకరి వ్యక్తిగత డాటా ఇచ్చేందుకు ఆదేశిస్తారు. కమిషనర్(Commissioner) అడిగారని సర్వీస్ ప్రొవైడర్‎లు కూడా వ్యక్తి గత సమాచారం ఇవ్వకూడదు. పోలీసులు ఎవరి ఫోటోలు ఎలా పడితే అలా తీయకూడదు. నేను ఎవరిని ఉద్దేశ్యపూర్వకంగా విమర్శించలేదు. నేనెవరిని కించపరిచేలా మాట్లాడలేదు.. దీనిపై ఎవరికి ఏమేం చెప్పాలో ఆది చెప్పాను. వేరే ఎఫ్ఐఆర్‎లో(FIR) సంజయ్‎ని ముద్దాయి చేశారు. వరంగల్ పోలీసులు లోక్‎సభ స్పీకర్ కార్యాలయంను(Lok Sabha Speaker's Office) తప్పుదోవ పట్టిస్తే లోక్‎సభ సభ్యుడుగా ప్రివిలేజ్(Privilege) ఉంటుంది. సంజయ్ బయటకు వచ్చాక ప్రివిలేజ్‎కు అనుగుణంగా చర్యలు తీసుకుంటారని’’ రఘునందన్(Raghunandan) పేర్కొన్నారు.

Updated Date - 2023-04-06T12:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising