MLA Rajasingh: ప్రజాపాలన ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం
ABN, Publish Date - Dec 28 , 2023 | 01:10 PM
Telangana: ప్రజాపాలన ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో అభయ హస్తం - ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గోషామహల్, మంగళహాట్ డివిజన్‌లను ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ఏర్పాట్లపై ఆయన అభ్యంతరం తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 28: ప్రజాపాలన ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో అభయ హస్తం - ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గోషామహల్, మంగళహాట్ డివిజన్‌లను ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ఏర్పాట్లపై ఆయన అభ్యంతరం తెలిపారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తులు ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా బయట జిరాక్స్ షాప్‌లో తెచ్చుకోవాలని, ఒక్కో దరఖాస్తుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 28 , 2023 | 01:10 PM