MP Komatireddy: నాకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయి..
ABN , First Publish Date - 2023-01-12T11:27:26+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) నూతన ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే (Manik Rao Thackeray)తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy)భేటీ ముగిసింది.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) నూతన ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే (Manik Rao Thackeray)తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy)భేటీ ముగిసింది. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకిచ్చిన షోకాజ్ నోటీసులు (Showcase Notices) ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని, పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనని అన్నారు. ఆరేడుసార్లు ఓడిపోయినవాళ్లున్న పీఏసీలో తాను కూర్చోవాలా? అని ప్రశ్నించారు. నిన్న (బుధవారం) నియోజకవర్గ పర్యటనల వల్ల ఠాక్రేను కలవలేకపోయానన్నారు. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు కలవలేదో వాళ్లని ముందు అడగాలన్నారు. కొన్నిసార్లు నియోజకవర్గం పనులతో కలవలేమని చెప్పారు.
తమ ఫోటోలను మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోవడంలేదని, తన ఫోటో మార్ఫింగ్ అయిందని స్వయానా సీపీగారే తనకు చెప్పారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో చెప్పినా.. ‘నీ పని నువ్వు చేసుకో అని కొత్త ఇంఛార్జి చెప్పారు.. ప్రజల్లో ఉండాలి యుద్ధం చేయాలని’’ చెప్పారన్నారు. ఇంఛార్జి తనకు కొత్త కాదని.. ముందే పరిచయం ఉందన్నారు. షోకాజ్ నోటీష్ అనేది లేనే లేదని.. ఫొటోల మార్ఫింగ్ క్లోస్డ్ మేటర్... అంటూ ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.