కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mutthi Reddy: టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి

ABN, First Publish Date - 2023-10-08T16:02:04+05:30

టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి‌రెడ్డి (Mutthi Reddy Yadagiri Reddy) ఆదివారం నాడు బస్ భవన్‌లో బాధ్యతలు చేపట్టారు.

Mutthi Reddy: టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి

హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి‌రెడ్డి (Mutthi Reddy Yadagiri Reddy) ఆదివారం నాడు బస్ భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో టీఎస్ఆర్టీసీ సంస్థ అగ్రగామిగా ఎదిగింది. సీఎం కేసీఆర్ తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పినందుకు.. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తాను. ఉద్యోగులతో సమన్వయంగా కలిసి పని చేస్తాను. సంస్థను నంబర్ వన్‌గా నిలుపుతాను. ఒకప్పుడు ఎక్కడుంది తెలంగాణ అనేవాళ్లకు.. ఇప్పుడు తెలంగాణను సీఎం కేసీఆర్ గ్లోబల్ సిటీగా మార్చారు. జనగామను మంత్రి కేటీఆర్ డైరెక్షన్‌లో దేశంలోనే టాప్ 3 మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు.

7.jpg

Updated Date - 2023-10-08T17:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising