Narsa Reddy: తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
ABN, First Publish Date - 2023-10-21T17:13:13+05:30
సిద్దిపేట: తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ సీనియర్ నేత నర్సారెడ్డి ( Narsa Reddy) అన్నారు.
సిద్దిపేట: తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ సీనియర్ నేత నర్సారెడ్డి ( Narsa Reddy) అన్నారు. శనివారం నాడు గజ్వేల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో కాకుండా వేరే నియోజకవర్గంలో గజ్వేల్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి నాపై దయ చూడండి. ఇకపై నెలకు ఒకసారి మీతో ఉంటా అని చెప్పే దుస్థితి వచ్చింది. గత ప్రభుత్వాలల్లో చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌రెడ్డి కాని ఎప్పుడు వాళ్ల కార్యకర్తలను బతిమిలాడలేదు. పదేళ్లలో గజ్వేల్ నియోజకవర్గ మండలాలకు ఇంతవరకు వెళ్లలేదు. రైతు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని అయినా ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. కేసీఆర్ సిద్దిపేట నుంచి గజ్వేల్‌కు బతకడానికి వచ్చారని.. గజ్వేల్‌పై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఇంతవరకు గజ్వేల్‌కు ఏమి చేయలేదు. గజ్వేల్‌ను కేసీఆర్ ఏం అభివృద్ధి చేయలేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో గజ్వేల్‌లో కేసీఆర్ ఒడిపోతారనే భయంతోనే కార్యకర్తలతో మీటింగ్ పెట్టి బతిమిలాడుతున్నారు. నేను గజ్వేల్ లోకల్ వాడిని మీతోనే ఉంటా. ఐదేళ్లలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన అన్నింటిని కూడా కేసీఆర్ పదేళ్లలో ఇవ్వలేదు. దత్తత తీసుకున్న గ్రామాలల్లో కూడా పెంకుటిల్లు కూల్చి ఇప్పటివరకు వారికి డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వలేదు. వర్గల్లో ప్రభుత్వ భూమిని తీసుకొని వారికి సరైన నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. మల్లన్నసాగర్లో భూములు కోల్పోయిన వారికి ఇప్పటికీ ప్యాకేజీలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా వాళ్లను అడ్డా మీద కూలీలుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే భూ నిర్వాసితులకు సరైన న్యాయం చేస్తాం. గజ్వేల్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచాక కేసీఆర్ చేయని అభివృద్ధిని నేను చేసి చూపిస్తా’’ అని నర్పారెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-10-21T17:13:13+05:30 IST