ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana Politics: కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి?

ABN, First Publish Date - 2023-05-29T23:00:30+05:30

బీఆర్‌ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైనట్టేనా?.ఈటెల రాజేందర్‌తో చర్చల అనంతరం నిర్ణయానికి వచ్చారా?. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరికపై ప్రకటన ఉంటుందా? అనే సందేహాలకు తావిచ్చేలా జూపల్లి, పొంగులేటి కేంద్రంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీఆర్‌ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరుతారనే సందిగ్ధానికి తెరపడిందా?. కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైనట్టేనా?. ఈ మేరకు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్‌తో చర్చల అనంతరం నిర్ణయానికి వచ్చారా?. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరికపై ప్రకటన ఉంటుందా? అనే సందేహాలకు తావిచ్చేలా జూపల్లి, పొంగులేటి కేంద్రంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

చాలా రోజులుగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి, మహబూబ్‌నగర్ జిల్లా కీలక నేత జూపల్లిని బీజేపీలో చేర్చుకునేందుకు అటు ఆ పార్టీ జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలో సోమవారం ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ బీజేపీకి షాకింగ్ కలిగించేలా ఉన్నాయి. ఇద్దరు నేతలతో జరిపిన చర్చలపై ఈటెల రాజేందర్ సోమవారం చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

‘‘ఇప్పటివరకు ఆ ఇద్దరి నేతలను ఏ పార్టీలో చేరకుండా ఆపగలిగాం కానీ.. బీజేపీలో చేర్చలేకపోయాం’’ అన్న ఈటెల మాటలతో ఉమ్మడి ఖమ్మం, మహాబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఈ కీలక నేతలిద్దరూ కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే చర్చకు దారితీస్తోంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందన్న ఈటెల... కమ్యూనిస్టులతోపాటు, టీడీపీ, చాలా పార్టీలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయన్నారు. ఈనేపథ్యంలో పొంగులేటికి, జూపల్లికి బీజేపీలో చేరేందుకు కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయన్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త జోష్‌ను నింపుకున్న కాంగ్రెస్.. అదే జోష్‌తో దక్షిణాది రాష్ట్రాల్లో తిరిగి కాంగ్రెస్ పుంజుకోవాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తిరిగి పునర్ వైభవం పొందుతుందని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో బీఆర్‌ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే జూన్ 2న ఇద్దరు నేతల చేరిక ఉంటుందని తొలుత ప్రచారం జరిగినా.. పండితుల సూచన మేరకు జూన్ 8న పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌లో చేరేందుకు పొంగులేటి కొన్ని షరతులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్న నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి..జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులకు ప్రాధాన్యతనివ్వాలని కోరినట్లు సమాచారం.

మొదట పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగినా..తాజా పరిణామాలు వారిద్దరు కాంగ్రెస్‌లో చేరితే తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయి ? కాంగ్రెస్ పార్టీలో చేరికలు మరింతగా పెరుగుతాయా ? రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి ? అన్నది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-05-29T23:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising