ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jupalli Krishnarao: కాంగ్రెస్‌లో జూపల్లి చేరిక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?..

ABN, First Publish Date - 2023-08-02T15:05:06+05:30

కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక మరోసారి వాయిదా పడింది. ఈరోజు (బుధవారం) జూపల్లి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి హస్తం పార్టీ తీర్థంపుచ్చుకోవాల్సి ఉంది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Former minister Jupalli Krishna rao) చేరిక మరోసారి వాయిదా పడింది. ఈరోజు (బుధవారం) జూపల్లి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge) సమక్షంలో జూపల్లి హస్తం పార్టీ తీర్థంపుచ్చుకోవాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో జూపల్లి చేరిక ఈరోజు జరగలేదని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి (Congress Leader Mallu Ravi) ప్రకటించారు. తిరిగి రేపు అనగా గురువారం ఉదయం జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు, కూచుకుల్లా రాజేష్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాధ్ రెడ్డిలతో పాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. త్వరలోనే బీజేపీ నుంచి చేరికలు ఉంటాయని చెప్పారు. రాజకీయ పునరేకికరణలో భాగంగా రానున్న రోజుల్లో భారీగా చేరికలు ఉంటాయన్నారు. కొల్లాపూర్‌లో త్వరలోనే భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సీనినటి,మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరడం ఆమె వ్యక్తిగత నిర్ణయమని.. దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని మల్లురవి పేర్కొన్నారు.


కాగా.. తొలుత అనుకున్న ప్రకాశం ఈరోజు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖారారు చేశారు. ఉదయం 9 గంటలకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో చేరనున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. ఇందు కోసం నిన్న (మంగళవారం) సాయంత్రమే జూపల్లి కృష్ణరావు, మరికొందరు మహబూబ్‌నగర్ జిల్లా నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల అపాయింట్మెంట్ నేపథ్యంలో ఖర్గే బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జూపల్లి చేరిక మరోసారి వాయిదా పడింది. రేపు జూపల్లి సహా మరికొందరు నేతలు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు మల్లురవి ప్రకటించారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌లో కృష్ణారావు చేరిక పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుకున్న ప్రకారం రేపు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారో లేదో చూడాలి.

Updated Date - 2023-08-02T15:13:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising