Modis Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్
ABN, First Publish Date - 2023-04-06T09:11:01+05:30
ఈ నెల 8న హైదరాబాద్‌కు(Hyderabad) ప్రధాని మోదీ(Prime Minister Modi) రానున్నారు. శనివారం ఉదయం 11.30గంటలకు
హైదరాబాద్: ఈ నెల 8న హైదరాబాద్‌కు(Hyderabad) ప్రధాని మోదీ(Prime Minister Modi) రానున్నారు. శనివారం ఉదయం 11.30గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు(Begumpet Airport) వచ్చిన తర్వాత ప్రధాని 11.35 గంటలకు బేగంపేట్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు(Secunderabad Railway Station) చేరుకోనున్నారు. అనంతరం 11.45 నుంచి 12.00 గంటలకు సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైల్(Secunderabad-Tirupati Vande Bharat Rail) ప్రారంభోత్సవం చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 12.15గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు(Parade Grounds) చేరుకుంటారు. 12.18 నిమిషాలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ సభ నుంచి వివిధ ప్రాజక్టులను జాతికి భారత ప్రధాని(Prime Minister of India) అంకితం చేయనున్నారు. అనంతరం 1.30గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ చేరుకుని మోదీ తిరుగు ప్రయాణం కానున్నారు.
Hyderabad: నేడు నగరంలో హనుమాన్ శోభాయాత్ర
కాగా, చారిత్రక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్తరూపు సంతరించుకోనుంది. నిజాం కాలం (1874)లో నిర్మితమైన స్టేషన్ ప్రాంగణాన్ని ఎయిర్‌పోర్టు తరహాలో తీర్చిదిద్దనున్నారు. విదేశీ స్టేషన్ల మాదిరిగా కళ్లు చెదిరే సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నారు. ఈమేరకు రూ.715 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈనెల 8న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేకు కేంద్ర బిందువుగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 121 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, గరిష్ఠంగా రోజుకు 1.40 లక్షల మంది, పండుగ రోజుల్లో 1.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
2025 అక్టోబరులోగా అందుబాటులోకి..!
ప్రాధాన్యత కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నవ్యనూతనంగా తీర్చిదిద్దేందుకు నడుంబిగించిన కేంద్రం.. పునరాభివృద్ధి పథకంలో భాగంగా ఎయిర్‌పోర్టు తరహాలో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) మోడల్‌లో పునర్నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. 2025 అక్టోబరులోగా పనులన్నీంటిని పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో రైల్వేశాఖ ముందుకు సాగుతోంది.
Updated Date - 2023-04-06T09:11:01+05:30 IST