ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

R. Krishnaiah: 6 గ్యారెంటీలు అద్భుతంగా ఉన్నాయి.. ప్రజాధారణ పొందుతాయి

ABN, First Publish Date - 2023-12-09T22:18:15+05:30

గత బిఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) అన్నివర్గాల ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుందని.. ప్రజల పోరాటం ఫలితంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగిందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ( R Krishnaiah ) అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్రం తొలిగించబడిన 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ అధ్యక్షతన శనివారం నాడు సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్: గత బిఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) అన్నివర్గాల ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుందని.. ప్రజల పోరాటం ఫలితంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగిందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ( R Krishnaiah ) అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్రం తొలిగించబడిన 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ అధ్యక్షతన శనివారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ... నిరుద్యోగులు , బీసీ , ఎస్సీ , ఎస్టీ , మైనార్టీల పక్షాన పోరాటం చేసిన రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని , కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టో‌లో హామీ ఇచ్చినట్లు బీసీల జనాభా లెక్కలను తేల్చాలని , పంచాయతీ రాజ్ ఎన్నికల రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు , బీసీల విద్య , ఉద్యోగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అద్భుతంగా ఉన్నాయని... భవిష్యత్తులో ప్రజాధారణ పొందుతాయని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పార్లమెంట్‌లో బీసీ బిల్లు కోసం ఈ నెల 13వ తేదీన ఛలో డిల్లీ చేపట్టి పార్లమెంట్‌ని ముట్టడిస్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు.

Updated Date - 2023-12-09T22:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising