ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajasingh : బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని వదిలి.. బుల్లెట్ బండిపై..

ABN, First Publish Date - 2023-02-11T12:01:51+05:30

‘బండి కాదు.. మొండి ఇది సాయం చేయండి’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే పలుమార్లు తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం విషయంలో అభ్యర్థించారు. ఇప్పటికే ఈ వాహనం మూడు సార్లు ఆగిపోయి మొండికేసింది. ఈ క్రమంలో తన వాహనాన్ని మార్చాలంటూ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ‘బండి కాదు.. మొండి ఇది సాయం చేయండి’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Rajasingh) ఇప్పటికే పలుమార్లు తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం (Bullet proof Vehicle) విషయంలో అభ్యర్థించారు. ఇప్పటికే ఈ వాహనం మూడు సార్లు ఆగిపోయి మొండికేసింది. ఈ క్రమంలో తన వాహనాన్ని మార్చాలంటూ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజాసింగ్.. వినూత్న నిరసనకు తెరదీశారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ కారును నిన్న వెళ్లి ప్రగతి భవన్ (Pragati Bhavan)‎ గేటు దగ్గర వదిలేశారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ (Punjagutta Police Station)కు తరలించారు. ఇక నేడు అసెంబ్లీకి తన బుల్లెట్ బండిపై దర్జాగా వచ్చేశారు. పోలీసులు అసెంబ్లీ (Assembly) లోపలికి వదలడంతో గేట్ నంబర్ 2 నుంచి లోపలికి వెళ్లారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రగతి భవన్‌కు వెళ్లారు. తనకు ఇచ్చిన బల్లెట్ ఫ్రూఫ్ వాహనం పదే పదే చెడిపోయిందని, ఎన్నిసార్లు చెప్పిన తన బాధ పట్టించుకోవడం లేదని, వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్‎ను కోరడానికి శుక్రవారం రాజాసింగ్ ప్రగతి భవన్‎కు వెళ్లారు. అయితే.. పోలీసులు రాజాసింగ్‎ను అడ్డుకోవడంతో‎ తన వెంట తీసుకువచ్చిన బల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ప్రగతి భవన్ ముందు వదిలేసి వెళ్లారు. ఇదే క్రమంలో రాజాసింగ్‎ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇంటికి వెళుతున్న సమయంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులో వెళ్తున్న సమయంలో కారు టైర్‌ ఊడిపోయింది. గతంలో పలుమార్లు కూడా వాహనం ఇబ్బంది పెట్టింది. మరో కారు కేటాయించాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన లేదని, పాత కారుకే మరమ్మతులు చేసి పంపిస్తున్నారని రాజాసింగ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-11T12:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising