ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: కవులు, కళాకారులకు గద్దర్ అవార్డులు

ABN, First Publish Date - 2023-08-12T18:39:29+05:30

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కవులు, కళాకారులకు ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డులు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి((Revanth Reddy)) అన్నారు. శనివారం నాడు బోయినపెల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కాంగ్రెస్ ప్రచార సభ నిర్వహిచింది.

హైదరాబాద్(Hyderabad): కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కవులు, కళాకారులకు ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డులు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి((Revanth Reddy)) అన్నారు. శనివారం నాడు బోయినపెల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కాంగ్రెస్ ప్రచార సభ నిర్వహిచింది. ఈ సభలో ‘‘తిరగబడదాం, తరిమికొడదాం’’ ఛార్జ్‌షీట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి , తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, భట్టి విక్రమార్క, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ లెజెండ్ గద్దర్(Gaddar). ఏ పదవి లేకుండా ప్రజలకోసం అన్ని దశాబ్దాలు కోట్లాడిన వారు గద్దర్ తప్పా ఎవరూ లేరు. గద్దర్ పేరు చిరస్థాయిలో నిలిచేలా చేస్తాం. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌(Tankbund)పై గద్దర్ విగ్రహం పెడితే ట్యాంక్‌బండ్‌కి గౌరవం పెరుగుతుంది. సీఎం కేసీఆరే(CM KCR) తోనే తెలంగాణ నష్టపోయింది. తెలంగాణకు ద్రోహం చేస్తే ఉరి తీయడం, పిండం పెట్టడం తెలంగాణ సంస్కృతి. తెలంగాణ పదమే ఇష్టం లేక పార్టీ పేరు మార్చుకున్న కేసీఆర్‌కు తెలంగాణకు ఏం సంబంధం.తెలంగాణ వాదానికి కేసీఆర్‌కు సంబంధం లేదు. కాంగ్రెస్ మోసం చేసిందని కేసీఆర్ అంటే అందులో కేసీఆర్ ఉన్నారు.. తెలుగుదేశం మోసం చేసింది అంటే అందులోనూ కేసీఆర్ ఉన్నారు. టీఆర్ఎస్ మోసం చేసింది అంటే అందులోనూ కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్, మోదీ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. కిషన్‌రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో బండి సంజయ్‌ని అడిగితే బాగా చెప్తారు. ప్రజా కోర్టు తెలంగాణ కాంగ్రెస్ థీమ్. ప్రజాకోర్టులో మోదీ, కేసీఆర్‌ను నిలబెడతాం. కేటీఆర్‌కు వాదానికి, వ్యాధికి తేడా ఏం తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను సోనియాగాంధీ విడుదల చేస్తారు.జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే సభలో ఖర్గే పాల్గొంటారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.


కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారు: మానిక్ రావ్ ఠాక్రే

తెలంగాణ ప్రజల కష్టాలను చూసి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మానిక్ రావ్ ఠాక్రే అన్నారు. తెలంగాణలో ఇప్పటికీ రాష్ట్ర ప్రజల కలలు నెరవేరలేదని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకొని తన కుటుంబ సంపద పెంచుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన మోసాలను బయటపెడతామని హెచ్చరించారు. ప్రజలకి ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తామని చెప్పారు.

Updated Date - 2023-08-12T19:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising