Revanth Reddy : తానా సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-07-10T13:31:39+05:30
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తానా సభల్లో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్ద పీట వేస్తామన్నారు. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని రేవంత్ పేర్కొన్నారు.
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తానా సభల్లో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్ద పీట వేస్తామన్నారు. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని రేవంత్‌ను ఎన్నారైలు కోరారు. దీనికి సమాధానంగా రేవంత్.. అవసరమైతే సీతక్కను సీఎం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ఎస్సీ, ఎస్టీల పక్షాన నిలుస్తుందన్నారు. దళితుడైన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి దళితులు, గిరిజనులకు అనుకూలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు కావొచ్చన్నారు. పని చేసే వారికి గౌరవం కచ్చితంగా దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పైరవీలు చేసుకోవాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు.
Updated Date - 2023-07-10T13:45:54+05:30 IST