ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vote for Note Case: మళ్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి కేసు...

ABN, First Publish Date - 2023-10-03T16:12:13+05:30

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు మళ్లీ హైకోర్టుకు వచ్చి చేరింది. ఓటుకు నోటు వ్యవహారంలో ఐదుగురు సాక్షులను ఒకే సారి క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయడానికి అవకాశం కల్పించాలని రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణను ముగించింది. హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినందున ఇకపై ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

న్యూఢిల్లీ: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఓటుకు నోటు కేసు మళ్లీ హైకోర్టుకు (Telangana Highcourt) వచ్చి చేరింది. ఓటుకు నోటు వ్యవహారంలో ఐదుగురు సాక్షులను ఒకే సారి క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయడానికి అవకాశం కల్పించాలని రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణను ముగించింది. హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినందున ఇకపై ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్‌‌పై తదుపరి నిర్ణయం హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి... విచారణను ముగిస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌విఎన్‌ భట్టి ధర్మాసనం ప్రకటించింది. దీంతో రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసు విచారణ హైకోర్టులో జరుగనుంది.

కాగా.. ఓటుకు నోటు వ్యవహారంలో ఉన్న సాక్షులను విడి విడిగా క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అందరినీ ఒకేసారి కలిపి క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయాలన్న రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు తిరస్కరించిన విషయం విషయం తెలిసిందే. ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రేవంత్ హైకోర్టులో సవాలు చేయగా.. స్థానిక కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులపై రేవంత్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సాక్షులను ప్రశ్నించే విషయంలో రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటషన్‌పై 2021 మే నెలలో సుప్రీం కోర్టు విచారణ జరిపింది. రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌‌పై ఐదు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని 2021 మే 28నజస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ట్రయల్‌ కోర్టులో సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేష్‌ జరగకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది.


సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. అదే విషయాన్ని ఈరోజు విచారణ సందర్భంగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌విఎన్‌ భట్టి ధర్మాసనానికి రేవంత్‌ రెడ్డి తరపు న్యాయవాదులు తెలిపారు.

Updated Date - 2023-10-03T16:35:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising