TS NEWS: బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యాక యెన్నం శ్రీనివాసరెడ్డి ఏమన్నారంటే..?
ABN, First Publish Date - 2023-09-05T16:52:32+05:30
బీజేపీ(BJP) పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక యెన్నం శ్రీనివాసరెడ్డి ( Srinivasa Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపార్టీలో చేరబోతున్నారే దానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పారు.
హైదరాబాద్: బీజేపీ(BJP) పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక యెన్నం శ్రీనివాసరెడ్డి ( Srinivasa Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపార్టీలో చేరబోతున్నారే దానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘తెలంగాణ అంశం బీజేపీకి అంశమే కాదు.కేంద్ర, రాష్ట్ర నాయకత్వం దృతరాష్ట్రుడిలాగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు రావని తెలిసి కార్యకర్తలను కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy)మభ్య పెడుతున్నారు. శంషాబాద్ ఫాంహౌస్ లో జరిగిన ఘటన తర్వాత సీన్ మారింది. మునుగోడులో గెలిచే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రాజీనామా చేయించి మోసం చేశారు. కర్ణాటకలో ఎన్నికల్లో పోటీకి సిద్ధం. ఓవైసీనే మా టార్గెట్ అంటే తెలంగాణ ప్రజలు అంత పిచ్చివాళ్ల.బండి సంజయ్(Bandi Sanjay) ఆధ్వర్యంలో పార్టీ బలపడింది. నేను ఏ పదవిని కోరుకోలేదు. కార్యకర్తలు బాగుపడాలనే నా తపన.వందశాతం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. ఉద్యమకారులంతా ఒక్కటై కేసీఆర్‌ను ఓడించాలి. 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని క్రింది కూర్చోబెట్టి వార్డు నెంబర్ కూడా కాని వ్యక్తి ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో బీజేపీలో చెబుతాడు. మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కలలు కంటున్నారు.కానీ త్వరలోనే కేసీఆర్ భవిష్యత్తు అంధకారం అవబోతుంది. ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశా.ఈటల విజయం సమష్టి విజయం. బీజేపీ పార్టీ కేసీఆర్‌ను ఓడించడం కల. ఈటల ఇప్పటికైనా భవిష్యత్ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది.ఉద్యమకారులు ఇప్పటికైనా ఏకం కావాలి. ఉద్యమకారులపై ఉమ్మేస్తే వారిపైనే పడుతుంది. బీజేపీ శ్రేణులు అబద్ధం వెంట పరిగెత్త వద్దనే నా మనవి.ఉద్యమకారులు కేసీఆర్‌ను బలంగా ఢీ కొడుతుందని భావించే బీజేపీలో చేరారు. కాని అది జరగదని తెలిసే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు’’ అని యెన్నం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-09-05T16:52:32+05:30 IST