Vinodkumar: అమిత్ షా ఆరోపణలు పూర్తిగా అవాస్తవం
ABN, First Publish Date - 2023-04-24T15:30:30+05:30
చేవెళ్ల సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారని..
హైదరాబాద్: చేవెళ్ల సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Union Minister Amit Shah) తెలంగాణ ప్రభుత్వంపై (Telangana Government) అనేక ఆరోపణలు చేశారని.. అవి పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ (State Planning Commission Vice Chairman Boinapally Vinod Kumar) స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసివేస్తామని చెప్పారన్నారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చే సెంట్రల్ ట్యాక్సెస్ నిధులు 2022 - 23కు లక్షా 20 వేల కోట్లకు పెరిగిందని అమిత్ షా చెప్పారని.. ఇది పూర్తిగా అవాస్తవమన్నారు. 2014-15 లో కేంద్ర ప్రభుత్వం నుంచి 15 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని.. 2020-23లో కేంద్రం నుంచి వచ్చింది 32 వేల 756 కోట్లు మాత్రమే అని ఆయన తెలియజేశారు.
నేషనల్ హైవేలకు తెలంగాణ నుంచి 39 వేల కోట్లు రోడ్ సెస్ వసూలు చేసి తెలంగాణకు 32 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. మత కలహాలు తప్ప బీజేపీకి మరో ఆలోచన లేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ సర్కార్ అద్భుతాలు సృష్టించిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో జరిగినట్లు అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. నేడు విదేశీ పౌరులు హైదరాబాద్ అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారన్నారు. తెలంగాణలో ఎలాంటి గొడవలు లేకుండా శాంతి భద్రతలను కాపాడుతున్నామని చెప్పారు. రైతు భీమా విషయంలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరో రాసిస్తే అవగాహన లేకుండా చేవెళ్ల సభలో అమిత్ షా మాట్లాడారన్నారు. తెలంగాణకు జాతీయ రహదారులు ఇవ్వాలని విభజన చట్టంలో ఉందని.. ఇది తెలంగాణ ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలని విభజన చట్టంలో పెట్టారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
Updated Date - 2023-04-24T15:30:30+05:30 IST