Taati Munjalu: ఎండాకాలంలో తరుచూ డీహైడ్రేషన్‌కు గురవుతున్నారా?.. ఇవి తినండి చాలు..

ABN , First Publish Date - 2023-03-15T12:37:24+05:30 IST

వేసవి వచ్చిందంటే తాటి ముంజల(Ice Apple) విక్రయాలు జోరందుకుంటాయి. వీటిని తింటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్నిస్తాయి. తాటి ముంజలను..

Taati Munjalu: ఎండాకాలంలో తరుచూ డీహైడ్రేషన్‌కు గురవుతున్నారా?.. ఇవి తినండి చాలు..

హైదరాబాద్: వేసవి వచ్చిందంటే తాటి ముంజల(Ice Apple) విక్రయాలు జోరందుకుంటాయి. వీటిని తింటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్నిస్తాయి. తాటి ముంజలను ఇష్టపడని వారు ఉండరు. నగర శివారుల నుంచి తీసుకొచ్చి వీటిని విక్రయిస్తుంటారు. డజను ముంజలు రూ.60 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారు. తాటి ముంజలు గర్భిణులకు ఔషధంలా పనిచేస్తాయని వైద్యులు అంటున్నారు. వీటిలో నీటిశాతం అధికంగా ఉంటుంది. వేసవిలో నాలుగు ముంజలు తింటే డీహైడ్రేషన్‌(Dehydration) నుంచి విముక్తి కలుగుతుంది. ప్రాంతాలను బట్టి కొందరు వీటిని సగ్గుబియ్య, బెల్లం వేసి వండుకుంటారు. ముంజలను చిన్న చిన్న ముక్కలుగా కోసి స్వీట్లు, లస్సీ, జ్యూస్‌, సలాడ్‌తోపాటు చికెన్‌, మటన్‌లో వేసుకుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్‌ బి, ఐరన్‌, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. వికారం, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బందిగా ఉన్నప్పుడు తాటి ముంజలు తింటే ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. \

ఉపయోగాలు (Uses)

  • తాటి ముంజల్లో తక్కువ కాలరీలు(Calories) ఉంటాయి. శరీరానికి కావలసిన శక్తి (Energy)ని ఇస్తాయి.

  • వేసవిలో శరీరానికి కావలసిన మినరల్స్‌, చక్కెరలని సమతుల్యం చేస్తాయి. తాటి ముంజల్లో విటమిన్‌ బి, ఐరన్‌, కాల్షియం మెండుగా ఉంటాయి.

  • గర్భిణులకు మంచి ఆహారం. జీర్ణవ్యవస్థ(Digestive System) మెరుగవుతుంది.

  • ముంజల్లో ఎ, బి, సి విటమిన్‌(Vitamin)లు, ఐరన్‌, జింక్‌, ఫాస్పరస్‌, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

  • కాలేయ సంబందిత వ్యాధులను తగ్గిస్తాయి. వీటిలో అధిమొత్తంలో ఉండే పొటాషియం ఉంది.

  • అధిక ఎండ, వేడికి వాంతులు అయినట్లు అనిపిస్తే తాటి ముంజలు తింటే ఉపశమనం లభిస్తుంది.

  • తాటి ముంజలు వివిధ రకాలైన ట్యూమర్‌, బ్రెస్ట్‌ క్యాన్స్‌ర్‌ కణాలను వృద్ధిచేసే పెట్రోకెమికల్స్‌, అంథోసయన్‌ లాంటి వాటిని నిర్మూలించి క్యాన్స్‌ర్‌ నుంచి

  • విముక్తి చేస్తాయి.

పోషకాలు మెండు

వేసవిలో తాటి ముంజలు తింటే మంచిది. శరీరానికి పోషకాలు అందిస్తాయి. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ముంజలు దోహదపడతాయి. ముఖ్యంగా

గర్భిణులు తాటిముంజలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు మంచి జరుగుతుంది. సీజనల్‌గా లభించే పండ్లను తింటే ఆరోగ్యానికి మంచిది.

- డాక్టర్‌ పరమేశ్వర్‌

Updated Date - 2023-03-15T12:37:24+05:30 IST